Iphone 17 big discount
Iphone 17 big discount

ప్రముఖ ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ తన నెక్స్ట్ సిరీస్ iphone 18ను మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సెప్టెంబర్‌లో తన 18వ సిరీస్ ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ క్రమంలో ముందు సిరీస్ 1phone 17పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు భారీ తగ్గింపులతో ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం 1phone 17పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్, బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

iPhone 17 Price & Offers

ఐఫోన్ 17 లోని 256జీబీ వేరియంట్ గత ఏడాది లాంచ్ సమయంలో రూ.82,900లకు విడుదల అయింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ.80,900లకు అందుబాటులోకి వచ్చింది. flipkart ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ.5,955 తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత iPhone 17ను రూ74,945కి పొందొచ్చు. ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. పాతది లేదా ప్రస్తుతం ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.57,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అయితే ఇంతటి భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ ప్రస్తుత పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లన్నీంటితో కలిపి iPhone 17 కేవలం రూ.17,695లకే లభిస్తుంది. అంటే దీని అసలు ధరపై సుమారు రూ.65,205 తగ్గింపు పొందొచ్చు.

iPhone 17 Features

iPhone 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. iPhone 17 ఆపిల్ A19 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఐఫోన్ iOS 26పై నడుస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ఎమర్జెన్సీ SOS, క్రాష్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే.. iPhone 17 వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.