maharashtra

దేశం వ్యాప్తంగా పేపర్ లీకేజీల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో TET -పేపర్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. 2026 జూన్ 28వ తేదీన జరగాల్సిన ఈ పరీక్ష.. కేవలం 24 గంటల ముందే లీక్ అయింది. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (MSCE) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పరీక్షల పారదర్శకతను, నమ్మకాన్ని కాపాడటం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

Also Read : బీజేపీది నకిలీ హిందుత్వం.. స్వామి అవిముక్తేశ్వరానంద్ సంచలన వ్యాఖ్యలు!

TET Paper Leak

శనివారం తెల్లవారుజామున థానే ప్రాంతంలోని భివాండి పోలీసులు ఒక రహస్య స్థావరంపై దాడి చేశారు. అక్కడ కొందరు వ్యక్తులు సీల్ చేసి ఉన్న టెట్-2026 క్వశ్చన్ పేపర్ ప్యాకెట్ లోని కొన్ని పేజీలను  ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే పరీక్షల మండలి అధికారులను పిలిపించి ఆ పేపర్లు నిజమైనవేనని నిర్ధారించుకున్నాక, భివాండి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వాస్తవానికి మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,028 కేంద్రాలలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఈ టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.28 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతూ, రేపు పరీక్ష రాయబోతున్నామన్న తరుణంలో పేపర్ లీక్ అవ్వడం, ఎగ్జామ్ క్యాన్సిల్ కావడంపై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : మీరు నిజంగా భారతీయులని ఏది నిరూపిస్తుంది?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.