
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను అరెస్ట్ చేసి, ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో, ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మమతా ఆరోపించారు. ఈ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా జరిగిందని ఆమె విమర్శించారు. బీజేపీ, జ్ఞానేశ్ కుమార్ కలిసి బెంగాల్ ఎన్నికలను దెబ్బతీశారని మమతా ఆరోపించారు. ఎన్నికలను తిరిగి ఇవ్వాలని, బెంగాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : ఢిల్లీలో VVIPలకు EC నోటీసులు.. సీఎంలు, మంతులు..!
ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. 2024 లోక్సభ ఎన్నికల నుంచి 2026 అసెంబ్లీ ఎన్నికల మధ్య పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 79 లక్షల పేర్లు తొలగించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో సుమారు 10 శాతానికి సమానం. ఈ అంశాన్నే మమతా బెనర్జీ ప్రధానంగా ప్రస్తావించారు. SIR పేరుతో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చేశారని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరుపై తీవ్రంగా విమర్శలు చేసిన మమతా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షాలు ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి ప్రయత్నించినా అది ముందుకు సాగలేదని ఆమె అన్నారు. ఇప్పుడు అభిశంసన అవసరం లేదని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మమత అన్నారు. అలాగే ఈ అంశంపై ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా త్వరలో సమావేశమవుతుందని చెప్పారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
కాగా 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 293 స్థానాల్లో 207 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు సాధించింది. దీంతో బెంగాల్లో 15 ఏళ్లుగా కొనసాగిన టీఎంసీ పాలన ముగిసింది. అయితే ఈ ఫలితాలను SIR ప్రక్రియతో ముడిపెడుతూ మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు. సీఈసీ, ఎన్నికల సంఘం వ్యవహారంపై న్యాయపరమైన మార్గంలో కూడా పోరాటం కొనసాగిస్తామని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా.. SIR మార్పులకు సంబంధించిన 37 లక్షలకు పైగా అప్పీళ్లు సెప్టెంబర్ నాటికి ట్రైబ్యునళ్ల ముందు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల్లో పేర్కొన్నట్లు సమాచారం.
Also Read : UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు.. చిన్న వ్యాపారులకు ఊరట: NPCI క్లారిటీ









