సాధారణంగా లిఫ్ట్‌లో ప్రయాణించే వారు.. ఎవరైనా ఇలా చేస్తారని ఊహించరు. కానీ ఘాజియాబాద్‌లో ఓ యువకుడు లిఫ్ట్‌లోనే చేయకూడని పని చేశాడు. లిఫ్ట్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి మూత్రం పోశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకు రావడంతో సొసైటీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఘాజియాబాద్‌లోని ఇందిరాపురం అహింసా ఖండ్-1లో ఉన్న షిప్రా కృష్ణ విస్టా సొసైటీలో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం ఎఫ్-2 టవర్‌లోని లిఫ్ట్‌లో ఓ యువకుడు మూత్రం పోసినట్లు తెలుస్తోంది. లిఫ్ట్‌లో నుంచి దుర్వాసన రావడంతో సొసైటీ వాసులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే ఏవోఏ, మెయింటెనెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

Also Read : UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు.. చిన్న వ్యాపారులకు ఊరట: NPCI క్లారిటీ

ఫిర్యాదు రావడంతో లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో ఓ యువకుడు లిఫ్ట్‌లోని కంట్రోల్ ప్యానల్ వైపు మూత్రం పోస్తున్నట్లు కనిపించింది. అదే సమయంలో ఒక అంతస్తులో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. మరో వ్యక్తి లోపలికి రావడానికి ప్రయత్నించాడు. లిఫ్ట్‌లో జరుగుతున్న విషయం చూసి అతడు వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా ఆ యువకుడు లిఫ్ట్‌లోనే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లిఫ్ట్ వంటి అందరూ ఉపయోగించే ప్రదేశంలో ఇలా చేయడంపై సొసైటీ వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Also Read : ధోనీ టీమ్ లో కీలక మార్పు : CSK కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్!

ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. కొంతమంది అతడు మద్యం తాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు మద్యం తాగి ఉన్నాడా లేదా ఏదైనా మత్తులో ఉన్నాడా అనే విషయం మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. సాధారణంగా అందరూ ఉపయోగించే ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేయడం సరికాదని పలువురు చెబుతున్నారు. ఈ ఘటనతో సొసైటీలోని ఉమ్మడి ప్రదేశాల విషయంలో మరోసారి చర్చ మొదలైంది. లిఫ్ట్, పార్కింగ్, మెట్ల దారి వంటి ప్రదేశాలను అందరూ శుభ్రంగా ఉంచాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని నివాసితులు కోరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై సొసైటీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.