
PM Modi : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుక ఇచ్చారు. రష్యన్ భాషలోకి అనువదించిన తిరుక్కురళ్ పుస్తకాన్ని పుతిన్కు అందించారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపిన సమయంలో మోదీ ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. తిరుక్కురళ్ తమిళ భాషలోని ప్రముఖ పురాతన గ్రంథం. ఇందులో మొత్తం 1,330 రెండు పంక్తుల పద్యాలు ఉన్నాయి. మంచి జీవితం ఎలా గడపాలి, నీతి, సంపద, ప్రేమ వంటి విషయాలను ఇందులో వివరించారు.
Also Read : నెట్వర్క్ రావడం లేదని.. టెక్నీషియన్ను టవర్కు కట్టేశారు!
తిరుక్కురళ్లో ఏ ఒక్క దేవుడి గురించి మాత్రమే కాకుండా.. అందరికీ ఉపయోగపడే మంచి విషయాలను చెప్పారు. మంచి నడవడి, సంపద, పాలన, ప్రేమ వంటి మూడు ప్రధాన విషయాలపై ఈ గ్రంథం ఉంటుంది. తమిళ ప్రజలు దీనిని ఎంతో గొప్పగా భావిస్తారు. అందుకే దీనిని తమిళ వేదం అని కూడా పిలుస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు.
భారత్, రష్యా మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. రెండు దేశాల మధ్య రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో సహకారం కొనసాగుతోంది. పుతిన్ బ్రిక్స్ బిజినెస్ ఫోరం కార్యక్రమంలో కూడా పాల్గొని మాట్లాడనున్నారు. భారత్, రష్యా మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచడం కూడా ఇరువురు నేతల చర్చల్లో ముఖ్యమైన అంశంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్, రష్యా మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని మరో 40 బిలియన్ డాలర్లు పెంచి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కాగా భారత్ ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కొత్త టెక్నాలజీ, దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం బ్రిక్స్లో భారత్, రష్యాతో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ దేశాలు ఉన్నాయి.
Also Read : శత్రువులకు మైండ్ బ్లాక్.. గాల్లోకి ఒకేలాంటి 2 ప్లేన్స్.. రాడార్లకే దొరకని పుతిన్ సీక్రెట్ ఫ్లైట్!









