
ఆగస్టు నెలలో సామాన్యుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల మార్కెట్‌లో వస్తువుల, ఉత్పత్తి, రవాణా ఖర్చులు బాగా పెరిగాయి. దీని ప్రభావం రోజువారీ వాడే వస్తువుల ధరలపై పడనుంది. ఎర్లీ మార్నింగ్ తాగే టీ నుంచి కార్ల వరకు అన్నింటి ధరలు కూడా ఆగస్టులో పెరగనున్నాయి. వినియోగ వస్తువుల కంపెనీలు ధరలను పెంచడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Gen Z చేతిలో 2029 రాజకీయం..దేశ భవితను మార్చనున్న 38 కోట్ల మంది ఓటర్లు!
Tea, TVs, cars and apparel to get costlier in August as West Asia conflict fuels fresh price hikeshttps://t.co/DbNIHEy7dt
— Economic Times (@EconomicTimes) July 28, 2026
ఈ ఏడాదిలో ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి. ఈ సారి ధరలు 6 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నెల నుంచి టీ, నూనె, కార్లు, రిఫ్రిజిరేటర్లు, దుస్తులు, కుక్కర్లు, స్టీల్ పాత్రలు, టీవీలు మొదలైన వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. రక్షాబంధన్, దసరా, దీపావళి పండుగలకు ముందు కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఈ సమయంలో ధరల పెరుగుదల ఉంటే వినియోగదారులకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది.
Also Read : కొందరికి జాక్‌పాట్.. మరికొందరికి రిస్క్.. ఈ రెండింటిలో ఏ లిస్ట్‌లో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి
జూన్ 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 శాతానికి పెరిగింది. మే నెలలో సీపీఐ 3.93 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతానికి చేరుకుంది. ఈ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆగస్టులో వినియోగదారులు బడ్జెట్ విషయంలో కచ్చితంగా ఇబ్బంది పడతారు. గల్ఫ్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చుల వల్లే తమ వ్యయాలు పెరుగుతున్నాయని కంపెనీలు వాదిస్తున్నాయి. పెరుగుతున్న తయారీ ఖర్చులు, రవాణా ఖర్చులు, ముడి పదార్థాల సరఫరాలో అంతరాయాల కారణంగా కంపెనీలు ధరలను పెంచక తప్పడం లేదు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫిబ్రవరి 2026లో ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకి తన కార్ల ధరలను రెండోసారి పెంచింది.
ఆగస్టులో మారుతి సుజుకి కార్ల ధరలు పెరగనున్నాయి. ఆ సంస్థ ధరను రూ.30,000 వరకు పెంచబోతోంది. మారుతి మాత్రమే కాకుండా ఆగస్టు 1 నుంచి హోండా కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. మెర్సిడెస్ బెంజ్, టాటా, మహీంద్రా ఇప్పటికే తమ కార్ల ధరలను పెంచాయి. ముడిసరుకు వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచాలని నిర్ణయించుకున్నామని ఆ సంస్థలు చెబుతున్నాయి. యుద్ధం తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. టీవీల ధరలు 15 శాతం పెరిగాయి. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరుగుతున్నాయి. లాభాలను నిలబెట్టుకోవడానికి కంపెనీలు ధరలను పెంచక తప్పడం లేదు.









