
PM Modi : ఫ్లై దుబాయ్ విమానంలో ఉన్న 174 మంది ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన ఆయనను ప్రధాని మోదీ ‘హీరో’గా అభివర్ణించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక హీరో అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
తీవ్ర ప్రమాదం ఎదురైన సమయంలో, తాను తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన ఎంతో ధైర్యంగా వ్యవహరించారని మోదీ పేర్కొన్నారు. ఇతరుల ప్రాణాలను రక్షించాలనే పట్టుదలతో కెప్టెన్ మచ్చర్ తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకంగా మారిందని ప్రధాని అన్నారు. ఆయన చూపిన ధైర్యం వల్ల వందలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయని, పెను విషాదం తప్పిందని మోదీ తెలిపారు. కెప్టెన్ మచ్చర్ ధైర్యానికి భారత్ గర్విస్తోందని ప్రధాని అన్నారు.
Also Read : ప్రాణాలు పోతున్నా వెనక్కి తగ్గలేదు.. నీర్జా, స్మిత్ మచ్చర్ ఇద్దరూ హీరోలే!
Captain Smit Machchhar is a HERO.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
— Narendra Modi (@narendramodi) October 1, 2026
ప్రస్తుతం గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు మంచి ఆరోగ్యం, మరింత బలం కలగాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కెప్టెన్ మచ్చర్‌ను ప్రశంసించారు. ఆయనను నిజమైన హీరోగా అభివర్ణిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు విమానాలు నడపడంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన బోయింగ్ 737 విమానాల్లో ఎక్కువగా పనిచేశారు. ఇప్పటివరకు 9,750 గంటలకు పైగా విమానాలు నడిపినట్లు సమాచారం. 2011లో స్మిత్ మచ్చర్ స్పైస్‌జెట్‌లో చేరారు. అక్కడ దాదాపు 11 ఏళ్లు పనిచేశారు. పైలట్‌గా మాత్రమే కాకుండా, ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతలు కూడా నిర్వహించారు. 2022లో స్పైస్‌జెట్‌ను వదిలి ఫ్లై దుబాయ్‌లో కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు తెలుస్తోంది.
Also Read : ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఫేక్ నోట్లు తయారీ.. కూరగాయల వ్యాపారి అరెస్ట్









