Tecno Pova 8 Pro 5G
Tecno Pova 8 Pro 5G

ఇటీవల మార్కెట్‌లో రిలీజ్ అయిన Tecno Pova 8 Pro 5G మొబైల్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. ప్రారంభ సేల్‌లో కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3000 తగ్గింపు లభిస్తుందని తెలిపింది. Tecno Pova 8 Pro 5G ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇందులో 6500mAh బ్యాటరీ అందించారు. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ 5G చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tecno Pova 8 Pro 5G Price

Tecno Pova 8 Pro 5G రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో బేస్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.49,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా కంపెనీ నిర్ణయించింది. Tecno Pova 8 Pro 5G ఫోన్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ అవుట్‌లెట్లలో సేల్‌కు అందుబాటులో ఉంటుంది.

Tecno Pova 8 Pro 5G offers

Tecno Pova 8 Pro 5Gపై ప్రారంభ ఆఫర్ కూడా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోళు చేస్తే రూ. 3,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఇంకా ఈ ఫోన్‌పై భారీ EMI ఆప్షన్ కూడా ఉంది. వినియోగదారులు 18 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లను పొందవచ్చు. ఈ ఫోన్ ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టండ్రా గ్రీన్ కలర్‌లలో లభిస్తుంది.

Tecno Pova 8 Pro 5G Specs

Tecno Pova 8 Pro 5G ఫోన్ 2644×1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.78-అంగుళాల హైపర్‌లక్స్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. Tecno Pova 8 Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అదే సమయంలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై నడుస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Tecno Pova 8 Pro 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.