
మేషం
మీరు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పనిచేస్తే కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. అనవసరపు అనుమానాలకు దూరంగా ఉండండి. ఈరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
వృషభం
ఉద్యోగం, వ్యాపారాలలో వాతావరణం బాగుంటుంది. ఇంట్లోని పెద్దల సలహాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. విష్ణుమూర్తిని స్మరించుకోవడం మంచిది.
మిథునం
మీకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్నేహితులు సహాయం చేస్తారు. లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం.
కర్కాటకం
మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. డబ్బు పరంగా ఈరోజు చాలా బాగుంటుంది. వచ్చే మంచి అవకాశాలను వదులుకోకండి. విష్ణుమూర్తి గుడికి వెళితే మేలు జరుగుతుంది.
సింహం
ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పూజలు, ఆధ్యాత్మిక విషయాలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది.
కన్య
ఉద్యోగ, వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. అందరితో కలిసిమెలిసి పనిచేస్తే మరింత అభివృద్ధి ఉంటుంది. విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించండి.
Also Read : బాంబులు పడింది ఇరాన్‌లో.. బ్రేకులు పడింది ఇండియా రోడ్లకి.. అసలు ఏమైంది?
తుల
ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందరితో కలిసి పనిచేయడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. లక్ష్మీదేవిని ప్రార్థించండి.
వృశ్చికం
ఈరోజు మీకు చాలా బాగుంటుంది. మొదలుపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త వింటారు. విష్ణుమూర్తిని పూజించడం వల్ల శుభం జరుగుతుంది.
ధనుస్సు
ఆత్మవిశ్వాసంతో ఉండండి. కష్టానికి తగిన ఫలితం కొంచెం ఆలస్యంగానైనా ఖచ్చితంగా వస్తుంది. ఆఫీసులో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. ‘గోవిందా’ నామస్మరణ చేయడం వల్ల పనులు పూర్తవుతాయి.
మకరం
పట్టుదలతో పనిచేస్తే మీ లక్ష్యాలు నెరవేరుతాయి. బంధువుల సహాయం అందుతుంది. పనుల్లో చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. శ్రీరామ నామం జపించడం మంచిది.
కుంభం
పనుల్లో ఆటంకాలు వచ్చినా పట్టుదలతో విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోండి.
మీనం
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి వార్తలు వింటారు. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి, వ్యాపారంలో లాభాలు వస్తాయి. లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం.
Also Read : ఒక్క సెకనులో సినిమా డౌన్‌లోడ్.. త్వరలో దేశంలోకి 6జీ.. ఎప్పటి నుంచంటే?









