
Trisha : తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో నటి త్రిష సందడి చేశారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జిలో ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. త్రిష తన తల్లితో కలిసి ఈ వేడుకలకు హజరయ్యారు. సీఎం విజయ్ తల్లి దండ్రులతో కలిసి మొదటి లైన్‌లో కూర్చుని వేడుకలను తిలకించడం విశేషం. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అధికారులను నవ్వుతూ పలకరించారు.. వారికి అభివాదం చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె కూర్చుని అందరినీ అలరించారు.
కాగా ముఖ్యమంత్రి హోదాలో సీఎం విజయ్ తొలిసారి 80వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల కోసం ఫోర్ట్ సెయింట్ జార్జికి సీఎం విజయ్ చేరుకోగానే ఆయనకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి విజయ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల్లో సేవలు చేసిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీసులకు పురస్కారాలను అందజేశారు. అంతకు ముందు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
కాగా, త్రిష , విజయ్ సినిమా రంగానికే చెందినవారే కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. విజయ్ సీఎంగా గెలిచిన తర్వాత, ప్రమాణస్వీకారంలోనూ త్రిష సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగినప్పటికీ అదేం జరగలేదు. కానీ, త్రిష తమిళనాడు రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాక, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆమెను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదస్పదమైన విషయం తెలిసిందే. మరోవైపు త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపాయి.ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురైవ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు చైన్నైలో పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించారు. ఈ నేపథ్యంలో త్రిష స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది









