
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వ్యవహారాలు ఎక్కువైపోయాయి. కట్టుకున్న వారిని, కన్న పిల్లలను, కుటుంబ పరువు, బాధ్యతల్ని వదిలి వేరొకరితో సంబంధం పెట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. ఏడుగురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ.. భర్త, పిల్లలను వదిలి సొంత బావతో పారిపోయింది. ఇంట్లో భార్య లేకపోవడాన్ని గుర్తించిన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇంద్రరాజ్ దంపతులు జీవిస్తున్నారు. వీరికి పెళ్లై ఏడుగురు సంతానం. ఇప్పటి వరకు హాయిగా సాగుతున్న వీరి సంసారంలో సడెన్‌గా పెద్ద కలకలం రేగింది. జూలై 13వ తేదీన ఇంద్రరాజ్ భార్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ క్రమంలో పని ముగించుకుని ఇంటికొచ్చిన భర్త ఇంద్రరాజ్ భార్యను పిలవగా ఆమె ఎక్కడా కనిపించలేదు.
దీంతో బందువులు, ఇంటి పక్క ఉన్నవారిని అడిగాడు. తెలిసిన వారి ఇళ్లల్లో వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. అదే సమయంలో మంఝన్‌పూర్ కోత్వాలి ప్రాంతానికి చెందిన వరుసకి అన్న అయిన రాకేష్ కుమార్‌పై అతనికి అనుమానం వచ్చింది. దీంతో రాకేష్ కుమారే తన భార్యకు మాయ మాటలు చెప్పి తనతో పాటు తీసుకెళ్లిపోయాడని ఇంద్రరాజ్ ఆరోపించాడు. వెంటనే రాకేష్‌ను నిలదీసేందుకు అతడి ఇంటికి వెళ్లాడు.
ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాకేష్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. చంపేస్తానని ఇంద్రరాజ్ను బెదిరించాడు. అనంతరం కోపంలో.. ‘‘ఇప్పుడు నీ భార్య నా దగ్గరే ఉంది. మేమిద్దరం భార్యాభర్తలుగా ఉన్నాం. నువ్వు ఎక్కడికి వెళ్లి చెప్పుకుంటావో చెప్పుకో’’ అంటూ ముఖం మీద చెప్పడంతో ఇంద్రరాజ్కు ఏం చేయాలో తోచలేదు. వెంటనే కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అక్కడ రాకేష్‌పై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆ మహిళ దొరికిన వెంటనే.. ఆమె ఇచ్చే వాంగ్మూలం ప్రకారం.. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఏడుగురు పిల్లలు తల్లి కోసం ఏడుస్తుండటంతో ఇంద్రరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.









