
Shoaib Akhtar : పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నయ్య షాహిద్ అక్తర్ ఇటీవల మరణించారు. అయితే, ఇప్పుడు ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ పెద్ద వివాదానికి దారితీసింది. ఇస్లామాబాద్‌లోని హెచ్-8 స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియల్లో.. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అలాగే దానికి అనుబంధంగా పనిచేసే పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!
Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.
PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026
వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడు ఇనామ్-ఉర్-రెహ్మాన్ కూడా ఈ అంత్యక్రియలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ PMML పార్టీని.. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు చెందిన రాజకీయ విభాగంగా భావిస్తారు. అంతేకాదు, గతంలో కాశ్మీర్‌లోని పహల్గాం దాడికి ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫుల్లా కసూరి అనే వ్యక్తితో ఇనామ్-ఉర్-రెహ్మాన్ కలిసి ఉన్న పాత ఫోటోలు కూడా ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు అక్తర్ అన్న అంత్యక్రియల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఈ వివాదం నడుస్తుండగానే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ స్వయంగా షోయబ్ అక్తర్ ఇంటికి వెళ్లారు. షాహిద్ అక్తర్ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అక్తర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఒక స్టార్ క్రికెటర్ కుటుంబంలో జరిగిన అంత్యక్రియలకు ఇలా నిషేధిత సంస్థల వాళ్లు రావడం పాకిస్తాన్లో కలకలం రేపుతోంది. పేర్లు మార్చుకుని ఉగ్రవాద సంస్థలు రాజకీయాల్లో, బహిరంగ కార్యక్రమాల్లో ఎలా తిరుగుతున్నాయనే అంశంపై అంతర్జాతీయంగా మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి నిషేధిత గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.









