
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు తాజాగా కళ్లెం పడింది. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం, వెండి ధరలు తగ్గాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,482 తగ్గి రూ.1,31,741 వద్ద ట్రేడవుతోంది. అంటే మార్కెట్ ప్రారంభంలోనే బంగారం ధర సుమారు 1.8 శాతం మేర పడిపోయింది.
Also Read : నిరుద్యోగులకు TGPSC అదిరిపోయే శుభవార్త.. 6 నెలల్లోనే ఉద్యోగం.. డీటెయిల్స్ ఇవే!
ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,575 వద్ద ట్రేడవుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. MCXలో కిలో వెండి ధరపై రూ.4,912 తగ్గుదల నమోదైంది. దీంతో కిలో వెండి ధర రూ.1,64,790 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
Also Read : బంగ్లాదేశ్లో బందీగా BSF జవాన్.. 5 గంటల హైడ్రామా!









