
Tank Bund Nimajjanam : హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ విగ్రహాల నిమజ్జన వేడుకలపై సందిగ్ధం నెలకొంది. నగరంలోని నిమజ్జన ప్రధాన వేదిక అయిన ట్యాంక్ బండ్‌పై ఈ ఏడాది విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ (GHMC), హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ ప్రాంతంలో హెచ్చరిక ఫ్లెక్సీలు, పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. భక్తులకు ముందస్తు సమాచారం అందించే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ల పేరిట ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్వం. పర్యావరణ పరిరక్షణతో పాటు, నిమజ్జన సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కేసులో సంచలనం.. భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం ?
ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం బంద్‌చేయడంతో బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని పోలీస్ అధికారులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ట్యాంక్‌బండ్ పై నిమజ్జనాల్ని అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు విగ్రహాలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి ట్యాంక్ బండ్ వైపునకు విగ్రహాలను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్బంగా DCP రక్షిత మూర్తి RTVతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనానికి పర్మిషన్ లేదన్నారు.హైకోర్టు ఆర్డర్స్ ఉండటం వల్ల నిమజ్జనం చేయనివ్వట్లేదని స్పష్టం చేశారు.9వ రోజు, 10 రోజు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి.పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు వస్తాయి.నిమజ్జనం చేయనివ్వాలా,వద్దా అనేది అప్పుడే డిసైడ్ చేస్తామని తెలిపారు.
Also Read : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 110 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!









