Bodybuilding Drug Racket : బాడీ బిల్డింగ్‌ పేరుతో మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లోఈ ముఠాకు సబంధించిన నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కాగా అరెస్ట్‌ అయినవారిలో  ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు కాగా, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితులు ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, వాటిని ఒక్కొ్క్కటి రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. వీరిలో ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేస్తున్నాడు. వాటిని షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

కాగా, జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు.. మొదట బాడీ కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు వివరించారు. అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. అందులో భాగంగా గోషామహల్ ప్రాంతంలో వీరు పలువురు కస్టమర్లకు ఇంజెక్షన్ లు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. అదే విధంగా ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులకు అందిన ఫక్కాసమాచారంతో  దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాగా ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.