
Hyderabad : ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకోగా, ఐటీ కారిడార్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఎదురెదురుగా రెండు బైక్‌లు అతి బలంగా ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
Also Read : తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
గచ్చిబౌలి వైపు నుంచి కొండాపూర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ అనే యువకుడు గచ్చిబౌలి వైపు నుంచి కొండాపూర్ ఏఎంబీ ఫ్లైఓవర్ మీదుగా తన బుల్లెట్ బైక్‌పై హఫీజ్‌పేట్ మార్గంలో వెళ్తున్నాడు. అదే సమయంలో, హఫీజ్‌పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపునకు శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు యువకులు స్కూటీపై అత్యంత ప్రమాదకరమైన రీతిలో రాంగ్ రూట్లో ఫ్లైఓవర్ పైకి వచ్చారు.
వంతెనపై రెండు వాహనాలు మంచి వేగంతో ఉండటంతో.. బుల్లెట్ బైక్‌ను ఈ స్కూటీ అతి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాద తీవ్రతకు స్కూటీ నడుపుతున్న శ్రీకాంత్, అతని వెనుక కూర్చున్న విఠల్ ఇద్దరికీ తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. అదృష్టవశాత్తూ బుల్లెట్ నడుపుతున్న వినోద్‌కు స్వల్ప గాయాల మాత్రమే అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు









