
Raj Gopal Reddy : సీఎం రేవంత్ రెడ్డికి తనకు మధ్య అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయని వ్యక్తిగత గొడవలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి – నేను ఎప్పుడూ తిట్టుకోవాలని కొందరి చూస్తున్నారని, మంచి జరిగితే మంచి అని… చెడు జరిగితే చెడు అని చెప్పడం నా నైజం అని ఆయన వెల్లడించారు. మంత్రి పదవి కోసం నేను రేవంత్ రెడ్డి దగ్గర కాంప్రమైజ్ అయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మంత్రి పదవి ఇచ్చేది అధిష్టానం – రేవంత్ రెడ్డి కాదు అని ఆయన స్పష్టం చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చింది అధిష్టానం.. అధిష్టానం ఏమీ చెప్తే నేను అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. నిధుల కోసం సీఎంను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించిన ఆయన – అభివృద్ధి జరగాలంటే సీఎం, డిప్యూటీ సీఎంను కలవాల్సిందేనన్నారు. కలిస్తే కంప్రమైజ్ అయ్యానని,- కలువకపోతే గ్యాప్ పెరిగిందని ప్రచారం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లో భిన్నభిప్రాయాలు ఉండటం సహజమని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ హార్ట్ అయి ఉంటారు. సీఎంగా వీక్ అయితానని అధిష్టానంతో భాధతో చెప్పుకొని ఉంటారని,సీఎం కొండా పై అధిష్టానానికి చెప్పుకోవడంలో తప్పేమి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇచ్చేది చిన్న అమౌంట్ ఏమీ కాదని కానీ, అవి సరిపోవడం లేదని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు.









