telangana municipal jobs 2026
telangana municipal jobs 2026

తెలంగాణలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ శాఖల్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అవసరమైన కొత్త సిబ్బంది భర్తీకి ఇటీవల ఆర్థిక శాఖ అంగీకారం తెలపడంతో.. నెక్స్ట్ మంత్రివర్గ సమావేశంలో దీనికి గ్రీన్‌సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 24 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా.. దీంతోపాటు మరికొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటి నిర్వహణకు సరిపడా స్టాఫ్ లేకపోవడంతో ఇప్పటివరకు వివిధ శాఖల నుంచి డెప్యుటేషన్లపై అధికారులను తీసుకొని పనులు కొనసాగిస్తున్నారు. దీనివల్ల స్థానిక పాలనా వ్యవహారాలు నెమ్మదిస్తున్నాయని గుర్తించిన అధికారులు.. దీనికి ఒక శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు మొత్తం 886 ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు గురించిన అధికారులు.. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖల నుంచి అనుమతులు వచ్చాయి.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లు: 20 పోస్టులు, డిప్యూటీ కమిషనర్లు (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు): 11 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు: 86 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (AEE): 56 పోస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, సీనియర్ అకౌంటెంట్లు: ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఈ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. రాబోయే నెక్స్ట్ కేబినెట్ భేటీలో అయినా ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుందని భావిస్తున్నారు.

దీంతో కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం.. నెక్స్ట్ ఇయర్ జనవరి నెలలో TGPSC ద్వారా ఈ 886 పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఈ నియామ ప్రక్రియ పూర్తియితే పురపాలక శాఖలో పాలన మరింత వేగవంతం కానుంది.