Telangana Jobs :  తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి వార్త చెప్పింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 మల్టీ జోనల్ పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి కమిషన్ అవకాశం కల్పించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 01/07/2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు భారీ స్కేల్ జీతం లభిస్తుంది. విద్యార్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు B.Arch, B.E/B.Tech (Civil), B.Planning / B.Tech (Planning), M.A (Geography), M.Sc (Geography) లేదా M.Sc (Geoinformatics) పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి.

Also Read : ప్రియుడితో కలిసి దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేసింది!

అర్హులైన అభ్యర్థులు 10/07/2026 నుండి 17/08/2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నిబంధనల కోసం అభ్యర్థులు టిజిపిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read : పచ్చని పందిట్లో ‘వధూ’ రూపంలో కాలనాగు..ప్రియుడితో కలసి నవవరుడి దారణహత్య

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.