దసరా పండుగ సెలవులకు తమ సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులు, పౌరుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో హాస్టళ్లు, కళాశాలల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు పండుగ వేళ ఊళ్లకు వెళ్లేందుకు పడే రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. వినోద్ కుమార్ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో పాఠశాలలు, కళాశాలలకు వరుస సెలవులు ఇస్తారు. ఆ సమయంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారుతాయి. రిజర్వేషన్లు దొరక్క, బస్సుల్లో సీట్లు లభించక విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారు. కష్టం మీద సొంత ఊళ్లకు వెళ్లకుండా కొందరు హాస్టళ్లలోనే ఉండిపోతారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది.

Also Read : నో టికెట్!.. కమెడియన్ లేని తెలంగాణ రాజకీయం..!

విద్యార్థులు నివసించే హాస్టల్, కళాశాలల ఆవరణల నుంచే నేరుగా ప్రత్యేక బస్సులను నడపనున్నారు. కేవలం విద్యార్థులకే కాకుండా వివిధ గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద కాలనీలు, టౌన్‌షిప్‌లలో నివసించే ప్రజలకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. తమ ప్రాంతం నుంచి సొంత ఊరికి వెళ్లేందుకు కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే ఆర్టీసీ అధికారులు నేరుగా వారి కాలనీ లేదా హాస్టల్ వద్దకే ప్రత్యేక బస్సును పంపుతారు. దీనివల్ల నగరంలోని ప్రధాన బస్టాండ్లకు వెళ్లే అవసరం లేకుండా ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

ఈ ప్రత్యేక బస్సుల సదుపాయాన్ని పొందేందుకు, బుకింగ్స్ కోసం ఆర్టీసీ వివిధ డివిజన్ల వారీగా అధికారుల ఫోన్ నంబర్లను కేటాయించింది.
కూకట్‌పల్లి డివిజన్: బీరంగూడ, కూకట్‌పల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, పటాన్‌చెరు, దుండిగల్, మియాపూర్, మాదాపూర్, బాలానగర్ ప్రాంతాల వారు డిప్యూటీ రీజినల్ మేనేజర్ నంబరు 99562 26148 ను సంప్రదించాలి.

Also Read : తెలంగాణ సర్కార్ సంచలనం.. మగవాళ్లకూ ఫ్రీ బస్సు?

సికింద్రాబాద్ డివిజన్ : మల్కాజిగిరి, రేతిఫైల్, ఉప్పల్, సికింద్రాబాద్, ఏఎస్ రావు నగర్, తార్నాక ప్రాంతాల వారు సికింద్రాబాద్ డీఆర్‌ఎం నంబరు 99592 26142 ను సంప్రదించవచ్చు.
హయాత్‌నగర్ డివిజన్: దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, ఆదిభట్ల, సరూర్ నగర్, హయాత్‌నగర్, బడంగ్‌పేట్, మిధాని ప్రాంతాల ప్రయాణికులు డీఆర్‌ఎం నంబరు 99892 26136 లో సంప్రదించాలి.
చార్మినార్ డివిజన్: రాజేంద్రనగర్, చార్మినార్, కాచిగూడ, మెహదీపట్నం, అత్తాపూర్, కోఠి ప్రాంతాల్లో ఉండేవారు చార్మినార్ డీఆర్‌ఎం నంబరు 99592 26129 కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు.