
US Loss : ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం జరిగింది. ఈ ఏడాది యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాకు చెందిన కనీసం 81 మిలిటరీ విమానాలు, డ్రోన్లు ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం జరిగిందని అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక తెలిపింది. వీటి విలువ దాదాపు 3.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. ఇందులో అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. F-35A లైట్నింగ్-2 స్టెల్త్ ఫైటర్, F-15 యుద్ధ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్లు వంటి ఖరీదైన ఆయుధాలు ఇందులో ఉన్నాయి.
ఒక్క F-15 యుద్ధ విమానం విలువ 30 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. ఇక దెబ్బతిన్న లేదా కోల్పోయిన 45 MQ-9 రీపర్ డ్రోన్లలో ఒక్కో డ్రోన్ విలువ 30 నుంచి 50 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన F-35A విలువ 92 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. మెరికా బలగాలు 12 F-15E విమానాలు, ఒక F-35A లైట్నింగ్-2 ఫైటర్, రెండు A-10 థండర్‌బోల్ట్-2 దాడి విమానాలు, ఏడు KC-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధనం నింపే విమానాలను కోల్పోయాయి.
Also Read : H-1B వీసాదారులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!
మార్చి 2న కువైట్ గగనతలంలో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్‌లో మూడు F-15 విమానాలు కూలిపోయాయి. ఆ తర్వాతి నెలలో ఇరాన్‌పై జరిగిన ఘటనలో మరో F-15 కూలిపోయింది. అలాగే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జోర్డాన్‌లోని మువాఫక్ సాల్టి ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడులు చేసిన సమయంలో మరో ఎనిమిది F-15E విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది.
ఇవే కాకుండా అమెరికా మిలిటరీకి చెందిన ఒక E-3 సెంట్రీ విమానం, రెండు MC-130J కమాండో-2 ప్రత్యేక ఆపరేషన్స్ విమానాలు, ఒక HH-60W జాలీ గ్రీన్-2 రెస్క్యూ హెలికాప్టర్, ఒక MQ-4C ట్రిటాన్ డ్రోన్, మూడు MQ-1 డ్రోన్లు, 45 MQ-9 రీపర్ డ్రోన్లు కూడా నష్టపోయాయి. బోయింగ్ 707 విమానాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసిన E-3 సెంట్రీ విమానం అమెరికా నిఘా వ్యవస్థలో కీలకమైనది. ఇది పాత మోడల్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా ముఖ్యమైన విమానంగా ఉంది. ఒక్క E-3 సెంట్రీ విలువ దాదాపు 270 మిలియన్ డాలర్లు. 2015 నాటికి అమెరికా ఎయిర్‌ఫోర్స్ వద్ద వీటిలో 32 మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
యుద్ధంలో అమెరికా మరో AH-64 అపాచీ అటాక్ హెలికాప్టర్, నాలుగు AH-6 లిటిల్ బర్డ్ లైట్ అటాక్ హెలికాప్టర్లు, ఒక MH-60 సీ హాక్ హెలికాప్టర్‌ను కూడా కోల్పోయింది. అయితే ఈ నష్టం సంఖ్య ఇంకా మారే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. కొన్ని యుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ రహస్యంగా ఉండటమే ఇందుకు కారణం. కొన్ని ఘటనలకు ఎవరు బాధ్యులో కూడా స్పష్టంగా తేల్చడం కష్టంగా ఉందని తెలిపింది. అలాగే దెబ్బతిన్న కొన్ని విమానాలకు మరమ్మతులు చేసి మళ్లీ సేవల్లోకి తీసుకురావచ్చని పేర్కొంది. మరోవైపు ఇరాన్లో అమెరికా ఉపయోగించిన ఆయుధాల ఖర్చు కూడా భారీగా పెరిగింది. నెల రోజులకు పైగా సమయంలోనే ఈ ఖర్చు 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.
Also Read : అమెరికాలో పెరుగుతున్న మీజిల్స్.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ









