World Largest Defense Headquarters: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ రికార్డులను తిరగరాస్తూ, ఈజిప్ట్ (మొరాకో) నిర్మించిన సరికొత్త సైనిక ప్రధాన కార్యాలయం ‘ఆక్టగాన్’ ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌గా నిలవనుంది. పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ మేఘాలు, సైనిక ఉద్రిక్తతల మధ్య ఈజిప్ట్ దేశం రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. జూలై 4వ తేదీన ఈజిప్ట్ తన సరికొత్త, అత్యంత బ్రహ్మాండమైన స్ట్రాటజిక్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ అసాధారణ సైనిక రక్షణ సముదాయానికి ‘ఆక్టగాన్’ (Octagon) అని నామకరణం చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ అల్-సిసి దేశానికి అంకితం చేసిన ఈ కాంప్లెక్స్.. ప్రస్తుత ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, అతిపెద్ద మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ సందర్భంలో అధ్యక్షుడు అల్-సిసి మాట్లాడుతూ.. ఈ కొత్త స్ట్రాటజిక్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ తమ సాయుధ దళాలలోని అన్ని విభాగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) మధ్య అత్యుత్తమ సమన్వయాన్ని, వ్యూహాత్మక ప్రణాళికలను మరింత బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ కేంద్రం, ఎలాంటి అంతర్జాతీయ సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ,దేశ వ్యూహాత్మక లక్ష్యాలను సురక్షితంగా ఉంచేందుకు ఈజిప్ట్‌కు సరికొత్త శక్తినందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈజిప్ట్ నిర్మించిన ఈ సరికొత్త సైనిక ప్రధాన కార్యాలయాన్ని నేరుగా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్రమైన ‘పెంటగాన్’తో పోలుస్తున్నారు. ఈ పోలిక కేవలం దాని భారీ పరిమాణం వల్ల మాత్రమే కాదు, అది నిర్వహించబోయే కీలక వ్యూహాత్మక పాత్ర వల్ల కూడా వస్తోంది. అమెరికా సైన్యానికి పెంటగాన్ ఎలాగైతే వెన్నుముకగా నిలిచిందో, అలాగే ఈ ‘ఆక్టగాన్’ ఇకపై ఈజిప్ట్ మిలిటరీ లీడర్‌షిప్, ఇంటెలిజెన్స్, ఆపరేషనల్ ప్లానింగ్, క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లను ఒకే గొడుగు కిందికి తీసుకురానుంది. అయితే ఆధునిక సాంకేతికత విషయంలో ఇది పెంటగాన్ కంటే రెండు అడుగులు ముందే ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈజిప్ట్ ‘స్టేట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్’ (SIS) కథనం ప్రకారం, ఇది కేవలం ఒక భవనం కాదు.. రక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక మహాసముద్రం. ఈ మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ మొత్తం 22,000 ఎకరాల విస్తారమైన భూభాగంలో విస్తరించి ఉంది. ఇందులో అష్టభుజి (Octagonal) రేఖాగణిత ఆకృతిలో నిర్మించిన ఎనిమిది ప్రధాన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను 13 ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్,లాజిస్టిక్ జోన్‌లుగా విభజించారు. ఇది యావత్ మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ ,డిఫెన్స్ కాంప్లెక్స్‌గా అవతరించింది.

Also Read : POK : పాకిస్థాన్‌కు పీవోకే అల్టిమేటం: 48 గంటల డెడ్‌లైన్.. జులై 9న ఫైనల్ యాక్షన్!

ఒక మినీ ‘మిలిటరీ నగరం’.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా

దీనిని కేవలం ఒక భవన సముదాయం అనడం కంటే ఒక చిన్నపాటి ‘రక్షణ నగరం’ (మినీ డిఫెన్స్ సిటీ) అని పిలవడం మరింత సమంజసంగా ఉంటుంది. ఈ భారీ క్యాంపస్‌ను ముఖ్యంగా నాలుగు భాగాలుగా విభజించారు:

కమాండ్ విభాగాలు

లాజిస్టిక్స్ విభాగాలు

శిక్షణ (ట్రైనింగ్) కేంద్రాలు

నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్

యుద్ధ వ్యూహాలను అచూకీగా, అత్యంత ఖచ్చితత్వంతో అమలు చేయడానికి, ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని అధునాతన కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్స్‌తో అనుసంధానించారు.

ఈ ‘ఆక్టగాన్’ హెడ్‌క్వార్టర్స్‌లో అత్యంత అధునాతన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన , రహస్యమైన నేషనల్ డేటాను శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి ఇందులో ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన అభేద్యమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఉపయోగించారు. హ్యాకర్లు కనీసం ఊహించని రీతిలో ఈ రక్షణ వలయాన్ని సిద్ధం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,కఠినమైన సైబర్ సెక్యూరిటీతో కూడిన ఈ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read : మేనీ అంత్యక్రియలు: ముగ్గురు కొడుకులు వచ్చినా.. మొజ్తబా ఎక్కడ?

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.