
రాబోయే దశాబ్దాలలో వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మానవ తప్పిదాలు, మనుషుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల భూమిపై మానవ ఉనికికే తీవ్ర ప్రమాదం పొంచి ఉందని లాన్సెట్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఈ 21వ శతాబ్దం ముగిసే సమయానికి అంటే 2100 నాటికి భూగోళంపై మనుషుల మనుగడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం(Humanity Ends 2100) ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవాళికి రాబోయే వందలాది ముప్పులను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ నివేదికలో పొందుపరిచారు.
Also Read : దుబాయిలో అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబరాలు – LIVE
17 catastrophic threats could shape humanity’s future by 2100. Two carry potential extinction risk.
A new assessment by The Lancet Commission on 21st Century Global Threats to Health has identified 17 interconnected threats that could cause massive losses in human health and well-being over the next 75 years.
The 17 threats are:
· Air pollution
· Antimicrobial resistance
· Childhood malnutrition
· Climate change
· Collapse of development assistance for health
· Conventional conflict
· High alcohol use
· High blood pressure
· Income inequality
· Low educational attainment
· Malicious use of AI
· Nuclear conflict
· Obesity
· Naturally occurring pandemics
· Poor mental health
· Smoking
· Unhealthy ageingTwo risks stand out for their potential to end humanity:
• Malicious AI use: Including the potential creation of biological weapons using AI.
• Nuclear conflict: A nuclear war could trigger a global famine by disrupting sunlight and food production.
Researchers stress that these extinction scenarios are considered low-likelihood risks, not inevitable outcomes.
The bigger message? These threats are interconnected, and many can be prevented or reduced through stronger healthcare systems, scientific innovation, better preparedness and coordinated global action.
Humanity’s future isn’t predetermined. The decisions made today could determine the world we inherit by 2100.
Source: The Lancet Commission on 21st Century Global Threats to Health.
— Hariom Kale (@thehariomkale) October 12, 2026
ఇందులో మానవాళిని పూర్తిగా నాశనం చేయగల వినాశకరమైన ప్రమాదాలలో అణ్వాయుధ యుద్ధం, కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ప్రథమ స్థానంలో ఉన్నాయి. వివిధ దేశాల మధ్య తలెత్తే రాజకీయ ఉద్రిక్తతలు అణు యుద్ధానికి దారితీస్తే ఆ దాడి వల్ల క్షణాల్లో జరిగే ప్రాణనష్టం ఒకటి అయితే.. ఆ తర్వాత వచ్చే రేడియోధార్మికత, వాతావరణంలో తలెత్తే మార్పులు, అణు కరవు వల్ల భూమిపై ఆహార ధాన్యాల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. ఇది జీవకోటి సమూల వినాశనానికి కారణమవుతుంది.
Also Read : అంబానీ vs మస్క్.. ‘అంబానీ దళారీ సైన్యం’ అంటూ ఎలాన్ మస్క్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు!
Humanity’s 2100 survival warning: These 17 catastrophic threats could devastate humanity https://t.co/7PuHTbAmzv
— Business Today (@business_today) October 12, 2026
మరోవైపు ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సరైన చేతుల్లో లేకపోతే అది మానవాళికి వరంగా కాకుండా శాపంగా మారే అవకాశం ఉందని లాన్సెట్ నివేదిక తేల్చిచెప్పింది. ఏఐ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి వినాశకరమైన జీవ ఆయుధాలను తయారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మానవ రహితంగా, అత్యంత వేగంగా పనిచేసే ఈ ఏఐ ఆధారిత జీవ ఆయుధాల ద్వారా ప్రాణాంతక వైరస్లు, బ్యాక్టీరియాలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తే కోట్లాది మంది ప్రజలు క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి సాంకేతిక దాడులను నిరోధించడం కూడా ప్రపంచ దేశాలకు చాలా కష్టతరంగా మారుతుంది.
ఈ అధ్యయనంలో నిపుణులు మానవాళికి ఉన్న ప్రమాదాలను ఒక పిరమిడ్ రూపంలో వివరించారు. ఈ పిరమిడ్లో అత్యున్నత, ప్రమాదకరమైన మొదటి స్థాయిలో అణు యుద్ధాలు, ఏఐ జీవ ఆయుధాల ముప్పును ఉంచారు. ఇవి కాకుండా మానవ సమాజాన్ని, ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే మరో 15 ప్రధాన వినాశకరమైన కారణాలను కూడా గుర్తించారు. వాటిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం, భూతాపం వల్ల వచ్చే వాతావరణ మార్పులు, సూక్ష్మజీవుల నిరోధకత, పిల్లల్లో పోషకాహార లోపం, మానసిక ఆరోగ్య సమస్యలు, మద్యం, పొగాకు వాడకం, అలాగే సహజంగా సంభవించే కొత్త రకం మహమ్మారులు ప్రధానమైనవిగా పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల అధినేతలు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఇప్పటికైనా కళ్లు తెరచి ఈ ముప్పులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా అంతే కఠినమైన చట్టాలు, అంతర్జాతీయ నియమావళిని రూపొందించాలని స్పష్టం చేసింది. ఇప్పటి నుంచే తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే తరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడం సాధ్యం కాదని.. మానవాళి తన సొంత తప్పిదాల వల్లే నాశనమయ్యే పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ది లాన్సెట్ కమిషన్ ఆన్ 21వ సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్ అనే సంస్థ అంచనా ప్రకారం రాబోయే 75 ఏళ్లలో మానవ ఆరోగ్యం, శ్రేయస్సుకు భారీ నష్టాలను కలిగించగల 17 పరస్పర సంబంధిత ముప్పులను గుర్తించింది.
వాయు కాలుష్యం
యాంటీ మైక్రోబయల్ నిరోధకత
బాల్యంలోనే పోషకాహార లోపం
వాతావరణ మార్పు
ఆరోగ్యానికి అందించే అభివృద్ధి సహాయం లేకపోవడం
యుద్ధాలు
అధిక మద్యపానం
అధిక రక్తపోటు
ఆదాయ అసమానత
తక్కువ విద్యా స్థాయి
ఏఐ (AI) దురుపయోగం
అణు సంఘర్షణ
స్థూలకాయం
సహజంగా సంభవించే వైరస్లు
మానసిక ఆరోగ్యం
ధూమపానం
అనారోగ్యకరమైన వృద్ధాప్యం









