
పదేళ్ల తర్వాత వ్యవధి తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియుయిన్తో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. సాధారణంగా విదేశీ అధ్యక్షులు వచ్చినప్పుడు వైట్ హౌస్ వద్ద స్వాగతం పలకడం అమెరికా అధ్యక్షుల ప్రోటోకాల్. కానీ వాణిజ్యం, ఏఐ, ఇరాన్, తైవాన్ వివాదాల నడుమ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టారు. స్వయంగా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఆండ్రూస్ ఎయిర్ బేస్ వైమానిక స్థావరానికి చేరుకుని చైనా అధ్యక్షుడికి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : బాలయ్య మాస్ వీడియోతో ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. మేం రెడీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇరాన్ ఎంబసీ!
✨🇨🇳President Xi Jinping said:
China and the United States should be partners, not rivals. Achieving the great rejuvenation of the Chinese nation and making America great again can go hand in hand, and the two countries can contribute to each other's success, thereby benefiting… pic.twitter.com/0asZBdOzKw
— 🇨🇳XuZhenqing徐祯卿 (@XueJia24682) September 24, 2026
మూడు రోజుల ఈ పర్యటనలో భాగంగా వైట్ హౌస్‌లో షీ జిన్‌పింగ్‌కు స్వాగత సత్కారాలు అందించనున్నారు. ఈ పర్యటనలో ట్రంప్, షీ జిన్‌పింగ్ దైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ వివాదాలపై అత్యంత కీలకమైన ఏకాంత చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా ఇద్దరు నాయకులు జాతీయ ఆర్కైవ్స్‌ను కూడా ఉమ్మడిగా సందర్శించనున్నారు. వైట్ హౌస్ ఆవరణలో కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌ను చూపుతూ.. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన హెలిప్యాడ్‌పై ఆయన దిగడం ఆనందంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
✨🇨🇳Xi said in a written speech upon his arrival for a US state visit that he is confident China and US, as two major countries, can find a right way to get along in the new era. https://t.co/caFMGdRnQB pic.twitter.com/5gLDhy7QGr
— 🇨🇳XuZhenqing徐祯卿 (@XueJia24682) September 24, 2026
Also Read : అమెరికా బయల్దేరిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ట్రంప్‌తో కీలక భేటీ!
చైనా అధ్యక్షుడికి రెస్పెక్ట్ ఇస్తూ రాత్రి వైట్ హౌస్‌లో ట్రంప్ ఒక భారీ విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, స్పేస్ఎక్స్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు బ్యాంకింగ్, కార్పొరేట్ రంగానికి చెందిన ప్రముఖులు ఈ విందుకు హాజరుకానున్నారు. ప్రపంచ టెక్ ప్రపంచమంతా ఈ విందు వద్దే ఉంటుందని, అందరికీ చోటు ఇవ్వడానికి సరిపడా సీట్లు కూడా లేవని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే అమెరికాలో షీ జిన్‌పింగ్‌కు లభించిన ఈ ఘన స్వాగతంపై సొంత దేశంలోనే రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చైనా చేపడుతున్న భారీ సైనిక విస్తరణ, ఇరాన్‌కు అది ఇస్తున్న మద్దతును దృష్టిలో ఉంచుకుని ఆయనను అమెరికాకు ఆహ్వానించి ఉండకూడదని సెనేట్ సాయుధ సేవల కమిటీ ఛైర్మన్ రోజర్ వికర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విందు సందర్భంగానైనా ఈ అంశాలపై ట్రంప్ గట్టిగా మాట్లాడాలని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరోవైపు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ భేటీని సమర్థిస్తూ.. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, సైనిక శక్తుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరగడం ప్రపంచ శాంతికి చాలా అవసరమని స్పష్టం చేశారు.









