
ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేడు వైట్ హౌస్‌లో మొదటిసారి సమావేశం కానున్నారు. అయితే ఈ ముఖ్యమైన సమావేశానికి కొన్ని గంటల ముందే వైట్ హౌస్‌లో నెతన్యాహుపై ట్రంప్ మండిపడ్డారు. టర్కీకి అత్యంత అధునాతనమైన F-35 స్టెల్త్ యుద్ధ విమానాలను విక్రయించాలనే అమెరికా ఆలోచనను ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఊహించని షాక్ ఇచ్చారు.
Also Read : జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!
🇺🇸🇹🇷 President Trump when asked if he will sell F-35 fighter jets to Turkey despite Israeli Prime Minister Netanyahu opposing it:
"Nobody tells me what we should be selling or not. Turkey has been a tremendous ally." pic.twitter.com/3baKXMtqr5
— BRICS News (@BRICSinfo) July 27, 2026
మిచిగాన్ వెళ్తున్న క్రమంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులు ట్రంప్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగా టర్కీకి ఎఫ్-35 జెట్‌ల అమ్మకాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే కథనాలపై ట్రంప్ ఓపీనియన్ అడిగారు. అప్పుడు ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ఎవరికి ఆయుధాలు అమ్మాలి, ఎవరికి అమ్మకూడదు అనేది పూర్తిగా వాషింగ్టన్‌లోనే నిర్ణయించుతామన్నారు. మనం ఏమి అమ్మాలి, ఏమి అమ్మకూడదు అని నాకు ఎవరూ చెప్పలేరని గట్టిగా అన్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ద్వారా తమ విదేశాంగ విధానంలో ఏ ఇతర దేశం కూడా జోక్యం చేసుకోదని.. చేసుకున్నా అమెరికా సహించదని స్పష్టం చేసినట్లు అర్థం అవుతుంది.
Also Read : ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా-ఇజ్రాయెల్ మధ్య లొల్లి.. నెతన్యాహుకి ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్
ఒకవైపు ఇజ్రాయెల్, టర్కీల మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. ట్రంప్ మాత్రం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. టర్కీ మీద తనకు ఎంతో నమ్మకం ఉందని.. నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని అన్నారు. ఎర్డోగాన్ అద్భుతమైన పనిచేశారు. ముఖ్యంగా సిరియా విషయంలో ఆయన పాత్ర ప్రశంసనీయం. ఆయన నా మంచి మిత్రుడు అని తెలిపారు. అంతే కాకుండా టర్కీ సైనిక బలాన్ని ప్రశంసిస్తూ.. టర్కీ చాలా శక్తివంతమైన దేశం.. దాని వద్ద చాలా పెద్ద సైన్యం, ఆధునిక సైనిక పరికరాలు ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా టర్కీ, ఇజ్రాయెల్ మధ్య ఉన్న విభేదాలను ట్రంప్ అంగీకరించారు. టర్కీ ఏమీ ఇజ్రాయెల్‌కు పెద్ద మద్దతుదారు కాదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. వారికి నెతన్యాహు అంటే కూడా అంతగా ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తమ ప్రయోజనాల దృష్ట్యా టర్కీ అమెరికాకు ఎంతో మేలు చేసిందని.. అందుకే ఆ దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్, టర్కీల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ.. అమెరికా మాత్రం ఈ రెండు దేశాలతోనూ సమానంగా సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.









