Balochistan Liberation Front (BLF) : పాకిస్థాన్‌ నుంచి విముక్తి కోరుకుంటున్న బలూచిస్తాన్‌ అనేక సంవత్సరాలుగా పోరాడుతుంది. ఒకవైపు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు మరోవైపు సాయుధ పోరాటం ద్వారా కూడా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. బలూచిస్తాన్‌ విముక్తి కోసం అనేక సాయుధ దళాలు పోరాటం చేస్తున్నాయి. అందులో ఒకటి బలూచిస్తాన్‌ లిబరేషన్ ఫ్రంట్‌ (బీఎల్ఎఫ్‌). ఈ వేర్పాటువాద సంస్థ నిరంతరం పాక్‌ సైన్యంపై దాడులు చేస్తూ ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా తాజాగా బలూచిస్తాన్‌ లిబరేషన్ ఫ్రంట్‌ (బీఎల్ఎఫ్‌) ఇటీవల మహిళ సైనికుల దళం కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్‌ను (కాడ్) ఏర్పాటు చేసింది.

Also Read : మా జోలికి వస్తే ఊరుకోం.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

ఈ సందర్భంగా బలూచిస్తాన్‌ ఫ్రంట్‌ కు చెందిన మహిళలు శిక్షణ తీసుకుంటున్న వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ దళం తాజాగా చేసిన దాడిలో 9 మంది పాక్ మిలిటరీ సిబ్బంది మరణించారని కూడా బీఎల్ఎఫ్‌ వెల్లడించింది. పలువురు గాయపడ్డారని ఆ గ్రూప్ పేర్కొంది. కాగా కలాట్‌ ఆపరేషన్ పేరిట పాక్ మిలిటరీ సిబ్బందికి చెక్ పెట్టినట్లు బలోచ్ ఫ్రంట్‌ పేర్కొంది. బీఎల్ఎఫ్ రిలీజ్ చేసిన వీడియోలో మహిళా సైనికుల శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. టుర్బాట్‌లో పాక్ సైనికులను మట్టుపెట్టడానికి ఉద్దేశించిన ఈ మిషన్‌కు ముందు వీడియోను తీశారు. మిషన్ లక్ష్యాలు, వ్యూహం గురించి ఓ మహిళ కమాండర్ తమ దళ సభ్యులకు వివరిస్తున్న వైనం వీడియోలో స్పష్టంగా ఉంది.

Also Read : అమెరికాతో తుది పోరుకు సిద్ధం… ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన

ఆ మహిళా కమాండర్.. టర్బత్ ప్రాంతంలో క్విక్ రియాక్షన్ ఫోర్స్ (QRF) కాన్వాయ్‌పై దాడికి ముందు కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్ ఫైటర్లకు వ్యూహాత్మకంగా బ్రీఫింగ్ ఇస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే కలాత్ పరిధిలోని మంగ్చార్ ప్రాంతంలో మహిళా ఫైటర్లు వాహనాలను ఆపి తనిఖీలు (స్నాప్ చెక్స్) చేస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. CPEC రోడ్డుపై జరిగిన ఈ దాడి తమ యూనిట్ చేపట్టిన రెండో ఆపరేషన్ అని బీఎల్ఎఫ్ వెల్లడించడం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా సాగించిన కఠిన శిక్షణ ద్వారా ఈ మహిళా దళాన్ని ఒక శక్తివంతమైన పోరాట బలగంగా తీర్చిదిద్దామని బీఎల్ఎఫ్ వెల్లడించింది. తమ సంస్థలో మహిళా యోధుల పాత్ర క్రమంగా పెరుగుతోందని చెప్పడానికి ఈ ఆపరేషన్లే నిదర్శనమని వివరించింది. బలోచిస్తాన్‌లో జరుగుతున్న బలవంతపు అదృశ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగానే తాము పాక్ బలగాలపై సాయుధ పోరాటం సాగిస్తున్నట్లు గ్రూప్ స్పష్టం చేసింది. తమ దళం సామర్థ్యాలు, విజయాలను చాటిచెప్పేందుకే బీఎల్ఎఫ్‌ ఈ వీడియోను షేర్ చేసినట్లు పేర్కొంది. అయితే, కాడ్ సభ్యుల తాజా దాడిలో ఎందరు పాక్ సైనికులు మృతి చెందారన్నది పూర్తిస్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.