
Chinese Academy Of Sciences : చైనాలోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ చేశారు. STERS- స్పాటియోటెంపోరల్లీ ఈవాల్వింగ్ రియాక్టివ్ స్పీసీస్ సాంకేతికతను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన జీవించే హైడ్రోజెల్‌ను అభివృద్ధి చేశారు. మానవ శరీరంలోని కణజాలాలు, నాడులు, ఎముకల వలె తన ఆకారాన్ని, పరిమాణాన్ని ఈ జెల్ మార్చుకోగలదు. ప్రమాదాలు లేదా అనారోగ్యం వల్ల దెబ్బతిన్న శరీర భాగాలను నయం చేయడానికి, పక్షవాత రోగులకు పునరుజ్జీవనం అందించడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.
🤖 CIENTISTAS CHINESES CRIAM HIDROGEL “VIVO” QUE MUDA DE FORMA COM UMA ÚNICA DOSE DE LUZ
Cientistas da Academia Chinesa de Ciências criaram um hidrogel que muda de forma como um organismo vivo. O sistema, chamado STERS, usa partículas de metal líquido e uma única dose de luz infravermelha para seguir reagindo por até quatro semanas.
Os pesquisadores de Shenzhen veem aplicações em engenharia de tecidos, interfaces cérebro-computador e robôs de aparência humana. Mas o próprio grupo alerta para o risco de segurança biológica dessa evolução morfológica programável.
O material borra a fronteira entre químico e vivo. Entenda o alcance e os riscos na matéria completa em O Cafezinho.
— O Cafezinho 🇧🇷 (@ocafezinho) October 6, 2026
సాధారణంగా మనం వాడే ప్లాస్టిక్, సిలికాన్ లేదా లోహాలు దానంతట అవి తమ రూపాన్ని మార్చుకోలేవు. కానీ మానవ శరీరంలోని కణాలు గాయాలు అయినప్పుడు చాలా సహజంగా, నెమ్మదిగా స్పందిస్తూ నయం అవుతాయి. చైనా శాస్త్రవేత్తలు సరిగ్గా ఈ సహజ ప్రక్రియను అనుకరిస్తూ హైడ్రోజెల్‌ను రూపొందించారు. ఈ జెల్లో సూక్ష్మమైన గాలియం ద్రవ లోహ కణాలను ఉపయోగించారు. దీనిపై సమీప- పరారుణ కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఒక రసాయన చర్య ప్రారంభమవుతుంది. ఒక్కసారి కాంతి ప్రసరింపజేస్తే చాలు.. ఎలాంటి బాహ్య సహాయం లేకుండా తదుపరి 28 రోజుల పాటు ఈ చర్య దానంతట అదే కొనసాగుతూ శరీరంలో క్రమంగా రూపాంతరం చెందుతుంది.
ప్రమాదాల వల్ల ఎముకలు విరిగినప్పుడు వైద్యులు కృత్రిమ కడ్డీలను అమరుస్తారు. అయితే శరీరం పెరిగేకొద్దీ ఇవి మారవు. కానీ ఈ కొత్త హైడ్రోజెల్పై మూలకణాలను ఉంచినప్పుడు వినూత్న ఫలితాలు వచ్చాయి. ఈ జెల్ మూలకణాలు మానవ ఎముకలు, నాడీ కణాలుగా రూపాంతరం చెందడానికి సహజమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. జెల్ సహాయంతో కణాలు వాటంతట అవే కొత్త ఎముకలు, నాడులను ఏర్పరుస్తాయి. కొత్త ఎముక తయారవుతున్న కొద్దీ దానికి అనుగుణంగా ఈ జెల్ కూడా తన ఆకారాన్ని మార్చుకుంటాయి.
నాడీ సంబంధిత సమస్యలు, పక్షవాతం ఉన్నవారి కోసం ప్రస్తుతం మెదడులో సిలికాన్ బ్రెయిన్ చిప్‌లను అమరుస్తున్నారు. కానీ ఈ గట్టి చిప్‌ల వల్ల మెదడులోని సున్నితమైన నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని కోసం హైడ్రోజెల్ ఉపయోగించవచ్చు. అయితే శాస్త్రవేత్తలు ఫ్లెక్సిబుల్ హైడ్రోజెల్‌తో ఎలక్ట్రోడ్లను తయారు చేసి ఎలుకల మెదడుపై పరీక్షించగా.. ఇది మెదడు పెరుగుదలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంది. ఎలాంటి వాపు లేదా గాయం కలిగించకుండా మెదడు తరంగాలను ఖచ్చితంగా రికార్డ్ చేసింది. వెన్నుపాము దెబ్బతిని మెదడుకు, శరీరానికి మధ్య సంబంధం తెగిపోయిన పక్షవాత రోగులలో తెగిపోయిన నరాలను తిరిగి కలపడానికి ఈ జెల్ వారధిలా పనిచేస్తుంది. దీనివల్ల ప్రమాదకరమైన బ్రెయిన్ చిప్‌లు లేకుండానే పక్షవాతం బాధితులు మళ్లీ అవయవాలను కదిలించగలుగుతారు.
వైద్య రంగంతో పాటు సాఫ్ట్ రోబోటిక్స్ రంగంలోనూ ఈ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తేనుంది. ప్రస్తుతం ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్లలో గట్టి ప్లాస్టిక్ చర్మం ఉంటుంది. కానీ ఈ హైడ్రోజెల్ ఉపయోగించడం ద్వారా మానవ కండరాలంత మృదువైన, వాతావరణానికి అనుగుణంగా రంగు, ఉష్ణోగ్రతను మార్చుకునే రోబోటిక్ చర్మాన్ని తయారు చేయవచ్చు.
అలాగే శరీరంలోకి ద్రవ లోహాన్ని ప్రవేశపెట్టడం సురక్షితమేనా అనే అనుమానాలకు శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. ద్రవ లోహం బయటకు కారకుండా రెండు సురక్షితమైన, జలనిరోధక రక్షణ పొరల మధ్య దీనిని భద్రపరిచే శాండ్విచ్ నిర్మాణాన్ని రూపొందించారు. దీనివల్ల 100 శాతం భద్రత లభిస్తుంది. ప్రస్తుతం ప్రయోగశాలలో విజయవంతమైన ఈ సాంకేతికతను సామాన్య రోగులకు అందుబాటులోకి తీసుకురావడానికి, వివిధ అవయవాల నయం అయ్యే వేగానికి అనుగుణంగా జెల్ సమయాన్ని సర్దుబాటు చేయడంపై పరిశోధకులు ఇంకా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సజీవ హైడ్రోజెల్ పక్షవాత రోగులకు బాగా ఉపయోగపడనుందని చెప్పవచ్చు.
Also Read : రష్యా ల్యాబ్‌లో పగిలిన టెస్ట్ ట్యూబ్.. లీకైన ప్లేగు బ్యాక్టీరియా.. ఆందోళనలో ప్రజలు









