Dubai Prince :  దుబాయ్‌ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ను కలిశారు. దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ను యువరాజు స్వయంగా వెళ్లి పరామర్శించారు. సహ పైలట్‌ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ.. స్మిత్‌ ధైర్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికులును కాపాడిన విషయం తెలిసిందే.

Also Read : రోహిత్ సెంచరీ మిస్.. కానీ సచిన్ రికార్డు బద్దలు!

విమానంలో సహ పైలట్‌ దాడి చేయడంతో స్మిత్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగారు. దీంతో ఇతర సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు అవకాశం లభించింది. స్మిత్‌ ధైర్యంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

ఆస్పత్రిలో స్మిత్‌ను కలిసిన దుబాయ్‌ యువరాజు ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. స్మిత్‌ ధైర్యాన్ని ప్రశంసిస్తూ యువరాజు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘మా తరఫున, దేశ నాయకత్వం తరఫున ఆయనకు పూర్తి అభినందనలు, ప్రశంసలు. ఆయన మా టీమ్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది. మా దేశ కథలో ఆయన కూడా ఒక భాగం. కరుణ, శాంతి, ప్రాణాలకు విలువ ఇవ్వడం.. UAE దేనికి ప్రతీకగా నిలుస్తుందో వాటిని ఆయన చూపించారు’’ అని షేక్‌ హమ్దాన్‌ తెలిపారు.

స్మిత్‌తో దుబాయ్‌ యువరాజు మాట్లాడుతున్న ఫొటోలు, ఆయనను ఆలింగనం చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత పైలట్‌ ధైర్యాన్ని గుర్తించిన దుబాయ్‌ యువరాజు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read : బంగ్లాదేశ్‌ను ముందుపెట్టి భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. ఏం చేస్తుందంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.