
ఫ్రాన్స్(France) లో ప్రస్తుతం అల్లర్లు కొనసాగుతున్నాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలంటూ మొదలైన చిన్నపాటి ఆందోళనలు.. ఇప్పుడు దేశవ్యాప్త అల్లర్లుగా మారాయి. దేశ రాజధాని పారిస్ మొదలుకొని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ రోడ్లన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం, వేలాది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటం, అలాగే పాఠశాల సిబ్బంది కొరతపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ పాఠశాల విద్యార్థులంతా కలిసి రోడ్లపైకి వచ్చారు.
Also Read : ఉక్రెయిన్పై ఏఐ మ్యూజిక్ సైకలాజికల్ వార్.. పాటలు పెట్టి చంపేస్తున్న రష్యా
🇫🇷 Mass riots are continuing in France
More than 400 schools are fully closed today over damage and threats to staff. Pupils have been moved to remote learning.
Despite bans on gatherings outside closed lycées, protests and clashes with police have been running since morning in… pic.twitter.com/rw6M3bS25m
— Visegrád 24 (@visegrad24) October 2, 2026
ఈ క్రమంలోనే పాఠశాల విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. మొత్తం 575 పాఠశాలలకు నిప్పు పెట్టారు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే పద్ధతి అత్యంత కష్టంగా మారిందని.. దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో డిగ్రీ, పీజీ విద్యార్థులు కూడా తమ నిరసనలు చేపట్టారు. శుక్రవారం నాడు జరిగిన భారీ ప్రదర్శనల్లో వేలాది మంది విద్యార్థులు ఒకేసారి పారిస్ వీధుల్లోకి వచ్చి భారీ స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా నగరంలో సాధారణ ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది.
🇫🇷 High-school students across France are blockading lycées over teacher shortages, overcrowded classes and crumbling buildings. What started in the Paris region has spread nationwide and turned violent: school fires, burning bins, clashes with police, teachers attacked. On… pic.twitter.com/RpmNyj7hj3
— DBS Morocco (@dbsmorocco) October 2, 2026
Also Read : ‘అవును, ఇన్స్టాగ్రాం ఉన్నది గర్ల్స్ కోసమే’ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
పరిస్థితి చేయి దాటిపోతుండటంతో విద్యార్థుల ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా రక్షణ బలగాలను దింపారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అంతేకాకుండా పలువురు విద్యార్థి నాయకులను, విద్యార్థులను పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దాడి చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నారు.
పోలీసుల చర్యకు ప్రతిచర్యగా అల్లర్లు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళనకారులు ఫ్రాన్స్ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 575 పాఠశాలలకు నిప్పు పెట్టారు. పాఠశాలల భవనాలు, ఫర్నిచర్, వాహనాలు కాలి బూడిదయ్యాయి. పారిస్ నగరం వీధులన్నీ రాళ్ల దాడి, పొగ చూరిన భవనాలు, ధ్వంసమైన వాహనాలతో యుద్ధ ప్రాంగణాన్ని తలపిస్తున్నాయి.









