Federal judge voids Trump's H-1B visa requirements
Federal judge voids Trump's H-1B visa requirements

H-1B Visa Holders : తమ దేశంలో ఉన్న విదేశీయులకు వరుస షాక్‌లు ఇస్తున్న అమెరికా మరో కొత్త నిబంధనతో H1B వీసా హోల్డర్లకు మరోసారి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధపడింది. అందులో భాగంగా అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును ఎత్తివేయాలని డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ హోమ్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆలోచిస్తోంది. గతంలో అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ వీసా హోదా మార్చుకోవడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్​ను వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే, వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లోని ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ బడ్జెట్’.. ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఒకవేళ వైట్‌హౌజ్‌ నిర్ణయం ప్రకారం 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించాలనే ప్రపోజల్ అమల్లోకి వస్తే.. ఉద్యోగం కోల్పోయిన మరుక్షణమే వీసాదారులు తమ చట్టబద్ధమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమెరికాలోని హెచ్-1బీ వీసాదారుల్లో సుమారు 71 శాతం మంది భారతీయులే. ఈ నిబంధన అమల్లోకి వస్తే మొదట నష్టపోయేది భారతీయులేననేది స్పష్టం.

దీంతో వీసా గడువు ముగిసిన వెంటనే వారంతా అమెరికాను వీడాల్సిందే. ప్రస్తుత ప్రతిపాదన ఫెడరల్ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌లో ప్రచురితమైన తర్వాత.. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడానికి కనీసం 30 నుంచి 60 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి హెచ్-1బీ వీసాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో వచ్చే మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరమని నిపుణులు చూచిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.