
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. నైరుతి పాకిస్తాన్లోని ఓ హైవేపై వేగంగా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో ఉండాల్సిన ప్రయాణికుల కంటే ఎక్కువ మంది ఉండటం వల్లే మరణాలు సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఖమేనీ అంత్యక్రియలు.. భారత్, చైనా, పాక్తో పాటు హాజరు కానున్న వారు ఎవరంటే?
#URGENT At least 40 people killed in Pakistan after a bus fell into ravine after crossing into northwestern Khyber Pakhtunkhwa province from Balochistan, official tells Anadolu
— Anadolu English (@anadoluagency) July 3, 2026
బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సుల సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న ‘దానా సర్’ అనే మారుమూల పర్వత ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే మార్గమధ్యంలో వేరే బస్సు పాడైపోవడంతో ఆ బస్సులోని ప్రయాణికులను కూడా ఇదే బస్సులోకి ఎక్కించుకున్నారు. దీనివల్ల బస్సు ప్రయాణికులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మలుపుల వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది.
Also Read : అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు సక్సెస్.. కానీ పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు!
🇵🇰 BREAKING: At least 40 people have been killed and 8 others injured after a passenger bus carrying 48 people plunged into a deep roadside ditch in Balochistan, southwestern Pakistan pic.twitter.com/AgLZD5WmIr
— Dhruv Mishra (@DhruvMishra1607) July 3, 2026








