
అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వాతావరణం నెలకొనే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. గత వారం ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనను రిజక్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత వైఖరి మార్చుకుని వేరే ప్లాన్‌ను టెహ్రాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల బృందాల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు సాగుతున్నప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. చర్చలు కాదని దాడులకు దిగితే ఇక యుద్ధమే!
Iranian Foreign Minister Abbas Araghchi says Tehran is reviewing Washington’s response to its proposal for ending the conflict and expects to deliver a reply in the coming days.
Araghchi said indirect negotiations remain ongoing, with messages being exchanged through mediators despite continued disagreements between the two countries.
Iran previously proposed a seven-day roadmap that would involve lifting the US naval blockade, easing sanctions on Iranian oil exports and releasing frozen Iranian assets. In return, Tehran would reopen the Strait of Hormuz and resume negotiations on a broader agreement.
US President Donald Trump rejected Iran’s initial proposal, describing its terms as unacceptable. However, diplomatic exchanges have continued as both sides consider possible steps towards ending the conflict.
The talks come amid growing concerns over attacks on commercial shipping in the Strait of Hormuz, a vital route for global oil and gas supplies.
Sources: Al Jazeera, Anadolu Agency
— The Sudan Times (@thesudantimes) October 8, 2026
అయితే యుద్ధాన్ని ఆపేందుకు కొన్ని రోజుల కిందట ఇరాన్ ఒక శాంతి ప్లాన్‌ను అమెరికా ముందుంచింది. మొదట్లో దీనిని తిరస్కరించిన ట్రంప్ యంత్రాంగం.. ఆ తర్వాత తమ వైపు నుంచి కొన్ని మార్పులతో కూడిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఇరాన్‌కు పంపింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. అమెరికా పంపిన ప్రతిపాదనపై ప్రస్తుతం తమ నిపుణుల బృందం విస్తృతంగా అధ్యయనం చేస్తోందని.. త్వరలోనే అధికారికంగా తమ సమాధానాన్ని అగ్రరాజ్యానికి వెల్లడిస్తామని తెలిపారు. తమ దేశం ఎల్లప్పుడూ శాంతియుత వాతావరణాన్ని, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు.
చర్చలకు సిద్ధమని చెబుతూనే అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మేము చర్చల పట్టిక వద్దకు రావడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. కానీ దౌత్య చర్చలను కాదని మాపై ఎలాంటి సైనిక చర్యలకు దిగినా, దాడులకు పాల్పడినా సహించేది లేదు. తిరిగి దాడులు చేస్తామని అరాగ్చి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ దౌత్య మార్గాలు విఫలమైతే పశ్చిమాసియాలో మళ్లీ భారీ యుద్ధం మొదలవుతుందని తెలుస్తోంది.
Also Read : పాకిస్తాన్‌ను ముక్కలు చేయబోతున్న ఆర్మీ చీఫ్.. ఆసిమ్ మునీర్ స్కెచ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఇదిలా ఉండగా.. నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందే యుద్ధానికి ముగింపు పలకాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీకి ముందు ఇరాన్‌పై ఎలాంటి సైనిక దాడులకు ఆదేశాలు ఇవ్వబోనని ట్రంప్ స్పష్టం చేశారు. టెహ్రాన్‌తో చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని, త్వరలోనే ఈ యుద్ధానికి తెరపడుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో యుద్ధం కొనసాగితే అది దేశీయంగా తమ రాజకీయ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆలోచనతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఓవైపు శాంతి చర్చలు చేస్తూనే మరోవైపు అమెరికా తన సైనిక బలాన్ని పశ్చిమాసియా తీరాలకు తరలిస్తుంది. అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌకలు పశ్చిమాసియా వైపు వేగంగా ప్రయాణిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే ఎన్నికల తర్వాత తీవ్రస్థాయి చర్యలకు దిగేందుకే అమెరికా ఈ స్థాయిలో బలాగమనాన్ని పెంచుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.









