
Pune : మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ బిజినెస్ మెన్ తన భార్యకు తెలియకుండా లవర్ తో కలిసి మలేషియా వెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే అతడి ప్లాన్ చివరికి బెడిసికొట్టింది. అతని లవర్ పాస్‌పోర్ట్ కారణంగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 46 ఏళ్ల ఈ వ్యక్తి పుణెలో లాండ్రీ వ్యాపారం చేస్తున్నాడు. సెప్టెంబర్ 14న తన లవర్ తో కలిసి కౌలాలంపూర్ వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఇద్దరూ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి లవర్ ను ఆపారు. ఆమె గతంలో పోయిందని చెప్పిన పాత పాస్‌పోర్ట్‌నే మళ్లీ ప్రయాణానికి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను ప్రయాణానికి అనుమతించలేదు.
Also Read : ఇరాన్‌కు ట్రంప్ దిమ్మతిరిగే షాక్.. హౌతీలతో చర్చలు .. యుద్ధానికి ఎండ్ కార్డ్!
దీంతో ఆ వ్యాపారి మలేషియా వెళ్లే ప్లాన్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ తనతో ఓ మహిళ ఉందనే విషయం భార్యకు తెలిస్తే సమస్య అవుతుందని భావించాడు. అందుకే ఇమ్మిగ్రేషన్ సమస్య వచ్చిందని భార్యను నమ్మించేందుకు ఓ కథ చెప్పాడు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చే ముందు ల్యాండ్‌లైన్ ఫోన్‌తో భార్యకు కాల్ చేశాడు. ఇమ్మిగ్రేషన్ సమస్య కారణంగా తన మొబైల్ ఫోన్‌ను అధికారులకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత తన లవర్ తో కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్లాడు.
మరుసటి రోజు భార్యతో వాట్సాప్ వీడియో కాల్లో కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా ఇమ్మిగ్రేషన్ సమస్యే వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్‌కి కాల్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు ఏదైనా జరిగిందేమోనని భయపడి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
అయితే అదే రోజు రాత్రి ఆ వ్యాపారి సహార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తనపై కిడ్నాప్ కేసు నమోదైందని తెలుసుకున్న తర్వాత పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఇమ్మిగ్రేషన్ సమస్య అంటూ భార్యకు చెప్పినదంతా అబద్ధమని, తానే ఆ కథను చెప్పానని పోలీసులకు చెప్పాడు. ఈ కేసును రెండు వారాల్లో కోర్టులో ముగించేందుకు సీ సమ్మరీ రిపోర్ట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. నిజంగా జరిగిన విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని కేసు నమోదైనప్పుడు ఇలాంటి రిపోర్ట్ ఇస్తారు.
Also Read : ట్రంప్ పన్నుల బాంబ్.. రష్యా ఆంక్షల చట్టంతో భారత్, చైనాలకు అమెరికా బిగ్ షాక్!









