Russian Strike :  ఉక్రెయిన్ రాజధాని కీవ్ దగ్గర్లోని ఒక గోదాముపై రష్యా డ్రోన్‌తో దాడి చేసింది. ఈ భయంకర దాడిలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపించేశారు.

ఈ దాడి వల్ల గోదాములో భారీగా మంటలు అంటుకుని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ విషయాన్ని కీవ్ ప్రాంతీయ గవర్నర్ టైమర్ టకాచెంకో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడ్డారని, బుచా జిల్లాలోని ఆ ప్రాంతం నుంచి 380 మందికి పైగా జనాన్ని ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు.

Also Read : ప్రకృతి విలయం.. చైనాలో నిషేధం : నేపాల్‌ వరదల వీడియోలపై కఠిన ఆంక్షలు!

కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో దాడులు పెంచేశాయి. ముఖ్యంగా గిడ్డంగిలు, చమురు కేంద్రాలు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. దీంతో అమాయక ప్రజలు పెద్ద ఎత్తున బలవుతున్నారు.

బుచా జిల్లాలోని మైలా గ్రామంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఆ గోదాములో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం చట్టబద్ధమేనా, ఆ కంపెనీకి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలతో సహా సుమారు 200 మందికి పైగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read : హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్‌ మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.