China : ప్రకృతి ఎంత ప్రమాదకరంగా మారుతుందో నేపాల్‌లో వచ్చిన వరదలే నిదర్శనం. నేపాల్, టిబెట్ సరిహద్దులోని గిరాంగ్ పోర్ట్ వద్ద ఈ పెను విపత్తు సంభవించింది. పెద్ద పెద్ద బండరాళ్లు, దట్టమైన బురద, భారీ నీటి ప్రవాహం ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఆ ఉప్పెనలో అక్కడి వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన జనం ఆ ప్రవాహంలో చిక్కుకుని కన్నుమూశారు. కొండల మధ్య వచ్చిన ఈ వరద భయానక సృష్టిని అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డు చేశాయి.

Also Read : కీవ్‌పై రష్యా దాడి.. 27 మంది మృతి!

ఈ భయంకరమైన వీడియోను ప్రపంచ దేశాలన్నీ చూసి కలవరపడ్డాయి. కానీ చైనాలో మాత్రం ఈ వీడియో కనిపించకుండా కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఇప్పటివరకు ఆ దేశంలో ఎక్కడా ఆ పూర్తి వీడియోను చూపించలేదు. కేవలం ఒకే ఒక ఫోటోను మాత్రమే చైనా మీడియాలో పదే పదే ప్రసారం చేస్తున్నారు. కఠినమైన నిబంధనలు ఉన్న చైనా ఇంటర్నెట్‌లో ఈ విపత్తుకు సంబంధించిన ఏ వీడియో కూడా రాకుండా అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులన్నింటినీ వెంటనే తొలగించారు.

వరదలు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం సహాయక చర్యలు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విపత్తు తర్వాత ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా స్పందించారు. చైనా వైపు కూడా చాలా నష్టం జరిగిందని సమాచారం ఉన్నా, బయటి ప్రపంచానికి మాత్రం ఎలాంటి నిజాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా నేపాల్ వరదలను చూస్తుంటే, చైనాలో మాత్రం ఆ వీడియోలు ఎవరికీ కనపడకుండా అడ్డుగోడలు కట్టారు.

ఈ విపత్తుపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌తో మాట్లాడారు. నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు దేశాల ప్రజలు కలిసికట్టుగా ఈ కష్టాన్ని అధిగమిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. బాధితులు త్వరలోనే తమ ఇళ్లను మళ్లీ నిర్మించుకుంటారని ఆశాభావం తెలిపారు.

Also Read : ఉక్రెయిన్‌ పై విరుచుకుపడ్డ రష్యా.. డ్రోన్ల దాడితో విధ్వంసం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.