Donald Trump : సౌదీ అరేబియా రాజధాని రియాద్ పై హూతీ తిరుగుబాటు దారులు పెద్ద ఎత్తున క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారు. ఇరాన్‌ మద్దతుతో చెలరేగి పోతున్న యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. కానీ, ఈ దాడి కారణంగా రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న సౌదీ ఆయిల్ దిగ్గజం అరామ్కోకు చెందిన ఇంధన డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. ఎయిర్‌పోర్ట్ సమీపంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ గా మారాయి.

హూతీ తిరుగుబాటుదారుల దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారడం కలకలం రేపింది. సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న హూతీలపై స్వయంగా దాడులకు దిగాలని అమెరికా యోచిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. దీనికి బలాన్నిచ్చేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ క్యాంప్‌ డేవిడ్‌లో తన పర్యటనను కుదించుకుని షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగానే శ్వేతసౌధానికి చేరుకున్నారు. హూతీలపై దాడులకు సైనికపరమైన ఎంపికలను క్యాంప్‌ డేవిడ్‌ సమావేశంలో ట్రంప్‌ సమీక్షించినట్లు సీఎన్‌ఎన్‌ జాతీయ భద్రతా విశ్లేషకుడు అలెక్స్‌ ప్లిట్సాస్‌ ‘ఎక్స్‌’లో పేర్కొనడం దీనికి మరింత బలాన్నిచ్చింది. ఇదిలా ఉండగా బ్రిటన్‌లోని రాఫ్‌ ఫెయిర్‌ఫోర్డ్‌ బేస్‌ నుంచి అమెరికాకు చెందిన అత్యాధునిక బీ-1బీ బాంబర్‌ యుద్ధ విమానం తాజాగా టేకాఫ్‌ కావడం ఆందోళనకరంగా మారింంది. అయితే అది ఎక్కడికి వెళ్తోందనేది తెలియరాలేదు. కానీ, ఇరాన్‌ తో పాటు హుతీలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : ఇరాన్ పై మరో భీకర దాడికి స్కెచ్.. అమెరికా ఇచ్చిన 5 సిగ్నల్స్ ఇవే!

ఏదో ఒకటి తేల్చేస్త – ట్రంప్‌

ఇదిలా ఉండగా ఇరాన్‌తో యుద్ధం విషయంలో ఇక మీదట నాన్చ దలచుకోలేదని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో తాను తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. త్వరలో భారీ పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు.. మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్‌ ద్వారా ఇరాన్‌ ఏడు షరతులతో కీలక ప్రతిపాదనలను అమెరికాకు చేరవేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తానన ఖరాఖండిగా చెప్పారు. ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయడం, లేదా ఆ దేశం ఆర్థికంగా చితికిపోయేలా చేయడం, దానితో ఒప్పందం కుదుర్చుకోవడం అనే మూడు అంశాలపై ట్రంప్‌ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : హామీలు నెరవేర్చే వరకు హర్మూజ్ బంద్.. ఇరాన్ స్పష్టీకరణ

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.