
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో బిగ్ షాక్ తగిలింది. CNN, MS NOW, Politico వంటి స్థలకు వైట్‌హౌస్‌లోకి జర్నలిస్టులను అనుమతించకుండా విధించిన నిషేధాన్ని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మూడు సంస్థలకు చెందిన జర్నలిస్టుల ప్రెస్ పాస్‌లను వెంటనే పునరుద్ధరించాలని అమెరికా జిల్లా న్యాయమూర్తి టిమోతి కెల్లీ ఆదేశించారు.
గురువారం ఇచ్చిన ఈ ఆదేశాలు 14 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో ఈ మూడు మీడియా సంస్థలపై విధించిన నిషేధాన్ని అధికారులు అమలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. సెప్టెంబర్ 18న ట్రంప్ ప్రభుత్వం CNN, MS NOW, Politico సంస్థలను వైట్‌హౌస్ నుంచి నిషేధించింది. తన ప్రభుత్వంపై ఈ సంస్థలు చేస్తున్న వార్తా కవరేజ్‌పై ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. ఈ నిషేధం తమకు అన్యాయంగా విధించారని, ఇది అమెరికా రాజ్యాంగంలోని పత్రికా స్వేచ్ఛ, చట్టపరమైన హక్కులకు విరుద్ధమని మూడు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.
Also Read : ట్రంప్‌కి ఇరాన్ షాక్.. అమెరికా నౌకలు వేలం.. వచ్చిన డబ్బుతో సంచలన నిర్ణయం
అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం వైట్‌హౌస్‌లోకి మీడియాను అనుమతించడం హక్కు కాదని, అది ప్రభుత్వం ఇచ్చే అవకాశం మాత్రమేనని వాదించింది. జర్నలిస్టుల కవరేజ్ తీరుతో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా నిషేధానికి కారణమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనలకు సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి కెల్లీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ పరిణామంతో CNN, MS NOW, Politico సంస్థలకు వైట్‌హౌస్ కవరేజ్ చేసే అవకాశం మళ్లీ లభించింది.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైట్ హౌస్ నుంచి 24 గంటల పాటు ప్రసారం అయ్యే ట్రంప్ టీవీని ప్రారంభించారు. ఇందులో ట్రంప్ ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, కొన్ని ప్రముఖ మీడియా సంస్థల మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో ఈ కొత్త ప్రసారం ప్రారంభించడం ఆసక్తిగా మారింది. అయితే ట్రంప్ టీవీ పేరుతో ప్రత్యేకంగా కొత్త టీవీ ఛానల్‌ను ప్రారంభించలేదు. ఇది వైట్ హౌస్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో నిరంతరం జరిగే లైవ్ ప్రసారం మాత్రమే.
Also Read : హౌతీలు సంచలన ప్రకటన.. ఆనందంలో ట్రంప్..?









