US Attack : ఇరాన్ సైనిక కార్యకలాపాలను, ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా చమురు సరఫరా కాకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీలు, వ్యక్తులపై తాజాగా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో భారతీయ ఐటీ, వాణిజ్య రంగానికి సవాలుగా ముంబైకి చెందిన రెండు ప్రముఖ కంపెనీలపై, అలాగే ఐదుగురు భారతీయ పౌరులపై అమెరికా విదేశాంగ శాఖ ఆంక్షల వేటు వేసింది.

Also Read : ఇండియన్ టెకీలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. సీరియస్ అయిన న్యూఢిల్లీ!

ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణా, కొనుగోళ్లు, దిగుమతులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ముంబైకి ప్రధాన కార్యాలయాలుగా ఉన్న ఎస్ఎస్‌పీఎల్‌ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సముద్ర మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలపై ఆంక్షలు విధించారు. అయితే ఈ కంపెనీల ప్రాతినిధ్యం వహిస్తున్న ధ్వని వోరా, నిసర్గ్‌ వోరా, కేతన్ కోచికర్, భూపేంద్రసింగ్ సాహూ, హరిశ్యామ్ హరిహరన్ అనే ఐదుగురు భారతీయ పౌరుల పేర్లను కూడా అమెరికా ఈ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

Also Read : టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోకు అమెరికా బిగ్ షాక్

కేవలం భారతీయ కంపెనీలపైనే కాకుండా ఇరాన్ చమురు వాణిజ్యంతో లింక్ ఉన్న మరో 10 అంతర్జాతీయ సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే ఆరుగురు వ్యక్తులు, ఇరాన్ చమురును రహస్యంగా రవాణా చేస్తున్న 5 నౌకలపై కూడా ఆంక్షలు విధించింది. ఈ భారీ నెట్‌వర్క్ ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలకు బిలియన్ల కొద్దీ డాలర్ల అక్రమ ఆదాయం సమకూరుతోందని అమెరికా అధికారులు గుర్తించారు.

టెహ్రాన్ కేంద్రంగా సాగుతున్న సైనిక కార్యకలాపాలకు, ఆయుధ సంపత్తికి, ప్రాంతీయ అస్థిరతకు ఈ చమురు వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా మారిందని వాషింగ్టన్ అభిప్రాయపడింది. ఇరాన్ సైన్యానికి నిధుల కొరత సృష్టించి ఆర్థికంగా ఒత్తిడి పెంచడం ద్వారా దౌత్యపరమైన పరిష్కారానికి తీసుకురావచ్చని అమెరికా భావిస్తోంది. అందుకే ఇరాన్ చమురు విక్రయాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే ఏ దేశ కంపెనీనైనా ఉపేక్షించేది హెచ్చరించింది.