ఇటీవల నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు యావత్తు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టాయి. తాజాగా మళ్లీ అమెరికాపై ప్రకృతి ఆగ్రహించింది. అమెరికాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఆరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో ఉన్నట్టుండి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల ధాటికి దాదాపు 20 మందికి పైగా పర్యాటకులు గల్లంతయ్యారు.

Also Read : సైప్రస్ తీరంలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా.. 237 మంది స్పాట్‌లో?

ఆకస్మికంగా సంభించిన ఈ వరద నీటి ప్రవాహంలో గల్లంతైన వారిలో 15 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొలరాడో నదిలో కలిసే బ్రైట్ ఏంజెల్ క్రీక్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ వరద ఉధృతి ఒక్కసారిగా ప్రారంభమైంది. నేషనల్ పార్క్‌లోని అత్యంత కీలకమైన బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలను ఈ మెరుపు వరదలు పూర్తిగా ముంచెత్తాయి. వరద ప్రవాహానికి భారీ బండరాళ్లు, పార్క్‌లోని పలు లోహ నిర్మాణాలు కొట్టుకుపోయి నేరుగా కొలరాడో నదిలో పడిపోయాయని నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.

Also Read : ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం.. 36వ అంతర్జాతీయ అవార్డు!

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను, స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. గల్లంతైన 20 మందికి పైగా పర్యాటకుల ఆచూకీ కనుగొనడానికి నేషనల్ పార్క్ సర్వీస్ బృందాలు, ఆరిజోనా రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ అధికారులతో కలిసి సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కాన్యన్ లోయల గుండా విపరీతమైన వేగంతో వరద నీరు, బురద పారుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పర్యాటకుల భద్రత దృష్ట్యా వరద ప్రభావిత మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. లోయ ప్రాంతాల్లో ఉన్నవారు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.