

– RAVI PRAKASH
CanadaNews : ఇండియన్ ఆరిజన్ లేడీ ఓనర్ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వైరల్ అవుతోంది? ఒక బార్బిక్యూ, ఒక టెనెంట్, ఒక ల్యాండ్‌లార్డ్, ఆ తర్వాత పోలీసులు. ఈ విచిత్రమైన వివాదం కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సరీ ప్రాంతం నుంచి వచ్చింది. ఈ గొడవ ఎలా ముదిరిందనే దానిపై మొత్తం నాలుగు వీడియోలు ఉన్నాయి. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే… 50 ఏళ్ల టెనెంట్ తాను అద్దెకు ఉంటున్న ఇంటి బయట బార్బిక్యూ పెట్టుకుని స్టేక్ గ్రిల్ చేస్తున్నారు. అప్పుడే అక్కడికి భారతీయ మూలాలున్న ఆ ఇంటి ఓనర్ రాజ్ తివానా వస్తుంది. ఆమె ఆ బార్బిక్యూని అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కెమెరాలో రికార్డైంది.
ఫస్ట్ వీడియోలో ఉన్నది గొడవకు బిగినింగ్ మాత్రమే. టెనెంట్ తన ఫ్రెండ్స్‌ని డిన్నర్‌కి ఆహ్వానించాడు. అయితే ఆ బార్బిక్యూ గొడవ అక్కడితో ఆగలేదు. రెండో వీడియోలో టెనెంట్ తన ఫ్రెండ్స్ డిన్నర్ కోసం వచ్చారని చెబుతాడు. వాళ్ల పార్టీ మూడ్‌ని ఇంటి ఓనర్ చెడగొడుతుందని కూడా అంటాడు. కానీ ఆర్గ్యుమెంట్ ఎంతకూ ఆగదు. ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించరు. ఇది చూడండి. ఇప్పుడు ఈ డిస్ప్యూట్ మరింత సీరియస్ అవుతుంది. ఎందుకంటే మూడో వీడియోలో టెనెంట్ తన అపార్ట్మెంట్లో ఉన్నాడు. తన ఫోన్లో మొత్తం గొడవను రికార్డ్ చేస్తున్నాడు. రాజ్ తివానా మళ్లీ గొడవలోకి ప్రవేశిస్తుంది. తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఈ వీడియోలో ఆమె టెనెంట్‌ను కొట్టడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. టెనెంట్ మాత్రం ఆపకుండా రికార్డింగ్ కంటిన్యూ చేస్తాడు.
ఇక నాలుగో వీడియోలో ఈసారి టెనెంట్ ల్యాండ్లార్డ్తో గొడవ పడడం లేదు. ఏకంగా సరీ పోలీసులు రంగంలోకి దిగారు. రాజ్ తివానాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఒక్క వీడియోతోనే స్టోరీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది. కేవలం ఒక బార్బిక్యూతో మొదలైన వివాదం చివరికి పోలీసులు ఇంటి ఓనర్ని అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. బ్రిటిష్ కొలంబియాలో ప్రాపర్టీ ఓనర్‌గా ఉన్నంత మాత్రాన టెనెంట్‌పై అంతులేని అధికారం చెలాయించడానికి చట్టం అంగీకరించదు. అక్కడి ‘రెసిడెన్షియల్ టెనెన్సీ యాక్ట్’ ప్రకారం టెనెంట్‌కు ప్రైవసీ, ఫ్రీడమ్, ఆ ఇంటిపై పూర్తి హక్కు ఉంటాయి. అంతేకాదు, ల్యాండ్‌లార్డ్ ఎప్పుడు పడితే అప్పుడు టెనెంట్ ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. కనీసం 24 గంటల ముందే రిటెన్ నోటీస్ ఇవ్వాలి. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే సరైన కారణంతోనే టెనెంట్ ఇంట్లోకి ప్రవేశించాలి.
ఇక్కడ మరో ముఖ్యమైన చట్టం కూడా ఉంది. బ్రిటిష్ కొలంబియా రూల్స్ ప్రకారం టెనెంట్ తన గెస్టులను ఇంటికి పిలుచుకోవడాన్ని ల్యాండ్‌లార్డ్ అడ్డుకోకూడదు. అంటే ఇది కేవలం ఇల్లు ఎవరిది అనే ప్రశ్న కాదు. ఇల్లు అద్దెకిచ్చాక టెనెంట్‌కు ఎలాంటి హక్కులు ఉంటాయి అనే విషయానికి సంబంధించింది. అందుకే ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేశాయి. ఎందుకంటే టెనెంట్ చేసిన ఆరోపణలు నిజమైతే ఇది కేవలం బార్బిక్యూ విషయంలో జరిగిన చిన్న గొడవ కాదు. ప్రైవసీ, ఇంట్లోకి ప్రవేశించే హక్కు, బెదిరింపులు, ల్యాండ్‌లార్డ్ అధికారానికి ఉన్న హద్దులు వంటి పెద్ద ప్రశ్నలను లేవనెత్తే వివాదం. అయితే ఆన్లైన్లో లాక్స్ మార్చడం, కరెంట్ సప్లై నిలిపివేయడం వంటి మరికొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కేవలం టెనెంట్ వైపు నుంచి వస్తున్న ఆరోపణలు మాత్రమే. ఈ క్లెయిమ్స్ అన్నింటినీ పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే ల్యాండ్లేడీ చెప్పిన పూర్తి వెర్షన్ కూడా మన దగ్గర లేదు. కాబట్టి ఒక వైరల్ వీడియో చూసి ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని కోర్టు తీర్పులా చెప్పలేం.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ప్రాపర్టీ ఓనర్‌గా ఉన్నంత మాత్రాన టెనెంట్ వ్యక్తిగత జీవితాన్ని శాసించలేరు. ల్యాండ్లార్డ్కు హక్కులు ఉన్నాయి. అదే సమయంలో టెనెంట్‌కు కూడా హక్కులు ఉన్నాయి. కెనడాలో ఆ హక్కులకు చట్టపరమైన రక్షణ కూడా ఉంది. అందుకే ఈ కథ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న కేవలం ఆ బార్బిక్యూ విషయంలో ఎవరిది తప్పు అనేది కాదు. అసలు పెద్ద ప్రశ్న ల్యాండ్‌లార్డ్ అధికారం ఎక్కడితో ముగుస్తుంది, టెనెంట్ ప్రైవసీ హక్కు ఎక్కడ మొదలవుతుందని. ఒక బార్బిక్యూతో గొడవ మొదలైంది. నాలుగు వీడియోలు ఆ గొడవ ఎలా పెరిగిందో చూపించాయి. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. ఇప్పుడు అసలైన ప్రశ్న కెమెరా ముందు ఏం జరిగిందనేది కాదు, కెమెరా ఆన్ కావడానికి ముందు ఏం జరిగింది? ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది? ఇదే అసలు కథ









