ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ అనర్హత వేటు వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి… ధరలు పెరడగానికి అసలు కారణం ఏంటంటే?

2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే బీఆర్ఎస్‌కు అధికారికంగా రాజీనామా చేయకుండానే 2024 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బీ-ఫారమ్ పోటీ చేయడం వివాదాస్పదమైంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరొక పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన స్పీకర్ చట్టబద్ధంగా పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read : మిర్యాలగూడలో ట్యాంకర్‌ బీభత్సం.. ఒకరు మృతి.. ఐదు కార్లు, 108 ధ్వంసం