kavitha

Kalvakuntla Kavitha : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెడతామని తేల్చి చెప్పారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ దానం నాగేందర్ పార్టీ మార్పు విషయాన్ని తప్పుపట్టారు. దానం ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. చేతలు మాత్రం శూన్యమని విమర్శించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ పేరిట డ్రామాలు అడుతున్నారని కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతా లోపాయికారీ ఒప్పందాలేనని.. ఫామ్‌హౌస్‌లపై చర్యలు ఉండవని ఆమె తేల్చి చెప్పారు.

ఇక తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపై కూడా కవిత స్పందించారు. తన ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అక్రమ భూములు లేవని, ఇనాం, కబ్జా లేదా అసైన్డ్ భూమి లేదని స్పష్టం చేశారు. అలాగే ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని, తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించానిని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ద్వారా అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌కు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read : నాని ప్యారడైజ్‌కి కలెక్షన్ల సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లు..

ది ప్యారడైజ్ పై సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ది ప్యారడైజ్‌ మూవీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కేసీఆర్‌ను అవమానించారని కవిత ఆరోపించారు.– ప్యారడైజ్‌ సినిమా ఆడటం లేదన్న ఆమె నేను ఆ సినిమా చూడను- అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డే డైరెక్టర్‌..కానీ సినిమా మాత్రం బాగాలేదన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ పై స్పందిస్తూ ఫ్యూచర్‌లో BRS సోషల్‌ మీడియాలో మాత్రమే ఉంటుందన్నారు.కేసీఆర్‌ పాటలకు డబ్బులిచ్చి డాన్స్‌ చేయిస్తున్నారన్నారు. ఇదంతా బీఆర్ఎస్‌ పెయిడ్‌ టీమ్‌ డాన్సులే అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న కవిత వచ్చే వేసవి నుంచే పాదయాత్ర స్టార్ట్ చేస్తానని ప్రకటించారు.పవన్‌ టీమ్‌ నన్ను కావాలనే ట్రోల్‌ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణపై మాట్లాడినందుకే పవన్‌ మీద మాట్లాడానని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో నన్ను బతుకమ్మ కూడా సరిగా ఆడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ గణేశుడు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.