
West Bengal: పశ్చిమబెంగాల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ నేతల పై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే కారుపై కొంతమంది వ్యక్తులు, కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం కలకలం సృష్టించింది. హుగ్లీ జిల్లా శీరాంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనంపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ ఈ రోజు శ్రీరాంపూర్‌లో మమతా బహిరంగ సభకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Hooghly, West Bengal: Mamata All India Trinamool Congress MLA Kunal Ghosh issued a video claiming that his vehicle was attacked in Uttarpara while he was travelling to attend former CM Mamata Banerjee’s political rally in Sreerampur.
@AITCofficial
#KunalGhosh #Attack #Hooghly #WestBengal
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 26, 2026
కాగా మొదట ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనాన్ని చుట్టుముట్టిన ఒక గుంపు ‘కుణాల్ ఘోష్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనాన్ని ముందుకు కదలకుండా నిలిపివేసిన ఆందోళనకారులు కోడిగుడ్లు, రాళ్లు రువ్వడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం పూర్తిగా పగిలిపోయింది.ఈ ఆకస్మిక దాడి, భద్రతా లోపం కారణంగా ఘోష్ తన శీరాంపూర్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ‘జంగల్ రాజ్’ నడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లాల్ బజార్ లేదా భవానీ భవన్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెళ్లడించారు.
Hooghly, West Bengal: Trinamool Congress (TMC) leader and MLA Kunal Ghosh’s car was allegedly attacked in Uttarpara in West Bengal’s Hooghly district, triggering tension in the area, a group of people allegedly threw eggs at the vehicle as it was passing through the area. The situation reportedly escalated, with stones, bricks, rods and sticks allegedly being used to target and damage the car.
— NextMinute News (@nextminutenews7) September 26, 2026
కాగా, ఎమ్మెల్యేపై జరిగిన దాడిని మాజీసీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు సృష్టించవద్దు’ అని ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈ ఘటనలో కుణాల్ ఘోష్‌కు గాయాలయ్యాయని ఆమె పేర్కొన్నారు, దాడి జరిగిన స్థలానికి తాను స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తానని స్పష్టం చేశారు. TMC నాయకులు, కార్యకర్తలను బీజేపీ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.
Stones and eggs were allegedly hurled at TMC MLA Kunal Ghosh’s car in West Bengal’s Hooghly district on his way to Serampore on Saturday to attend a meeting of party supremo Mamata Banerjee. https://t.co/o8ujBnRyz2
— Syeda Shabana (@JournoShabana) September 26, 2026
Stones and eggs were allegedly hurled at TMC MLA Kunal Ghosh’s car in West Bengal’s Hooghly district on his way to Serampore on Saturday to attend a meeting of party supremo Mamata Banerjee. https://t.co/o8ujBnRyz2
— Syeda Shabana (@JournoShabana) September 26, 2026









