student protests : శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన పంజాబ్‌లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన ఆదివారం ఉదయం మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లో నానా హంగామా సృష్టించారు. క్యాంపస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23యూఎమ్‌పైకి ఎక్కిన ఓ విద్యార్థి నిరసన తెలియజేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వదంతులు యూనివర్సిటీ వ్యాప్తంగా వ్యాపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దీంతో శనివారం అర్థరాత్రి నుంచి క్యాంపస్‌లో ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనల్లో భాగంగా ఆదివారం ఉదయం విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. క్యాంపస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23యూఎమ్‌ విమానంపైకి ఎక్కి ఓ విద్యార్థి నిరసన తెలిపారు. మరో పదిమంది విద్యార్థులు మిలిటరీ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగారు.

పలువురు విద్యార్థులు క్యాంపస్‌లోని గదుల కిటికీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అక్కడక్కడ యూనివర్సిటీ భవనాలకు నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అంతటితో ఆగని విద్యార్థులు సమీపంలో ఉన్న జలంధర్-ఫగ్వారా నేషనల్ హైవేను దిగ్బంధించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

అసలేం జరిగిందంటే..
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని శనివారం రాత్రి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తును పుకార్లు చికారు చేశాయి. ఈ విషయం విద్యార్థులకు చేరడంతో అర్థరాత్రి విద్యార్థులు నిరసనకు దిగారు. సెప్టెంబర్ 24న యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న ఓ యువతిపై కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని వారు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. స్పందించిన పోలీసులు దీనిపై ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఇవన్నీ వదంతులని విద్యార్థుల ఆందోళనను కొట్టిపాడేసింది. అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. పుకార్లను విశ్వసించొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులను కోరింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.