
Khairatabad Assembly : హైదరాబాద్ లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు మధ్యంతర ఎన్నికపై ఉన్న సందిగ్ధత తొలగినట్లయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు దృవీకరించారు. కాగా, ఇటీవల దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే.దీంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. నాలుగేళ్ల రూల్స్ పై క్లారిటీ
కాగా, దానం నాగేందర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి కారు గుర్తుపై పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒకపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేయడంతో బీఆర్‌ఎస్ ఆయనపై హై కోర్టులో ఫిరాయింపు పిరాయింపు పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించింది. దీంతో ఆయన 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అర్హత కోల్పోయినట్లు తీర్పునిచ్చింది. అంతేకాక అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో త్వరలో ఈ స్థానానికి ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
Also Read : మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాల్సిందే… సీఎం రేవంత్ రెడ్డి









