CM Revanth Reddy : కేటీఆర్ కుటుంబం హైటెక్‌ సిటీ సమీపంలో ‘అత్ హోమ్ హాస్పిటాలిటీ’ పేరుతో హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో హోటళ్లను నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మొన్న అసెంబ్లీలో ఈ విషయాన్ని చెప్పలేదని, పార్ట్‌ టూలో భాగంగా ఈ విషయాన్ని చెప్తున్నానన్నారు. ఈ రోజు సిరిసిల్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావు, సంతోష్‌ రావులపై నిప్పులు చెరిగారు. అమెరికాలో బాత్రూంలు, హోటళ్లల్లో ప్లేట్లు కడిగిన కేటీఆర్‌కు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు.

హౌటెక్‌ సిటీ రోడ్డులో 190 గదులతో కూడిన ‘డెక్కన్ సెరాయ్’ అనే 4-స్టార్ హోటల్/సర్వీస్డ్ అపార్ట్‌మెంట్స్ నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనితో పాటు మైండ్‌స్పేస్ వద్ద 100 గదుల డెక్కన్ సెరాయ్, కొండాపూర్‌లో 120 గదుల హోటల్ ఉన్నాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు. తనకు, తన తండ్రికి ఇల్లేలేదని చెప్పే కేటీఆర్‌కు ఇన్ని కోట్ల ఆస్తులెలా వచ్చాయని రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ‘దమ్ముంటే మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ‘హైటెక్‌ సిటీ పక్కన స్టార్‌ హోటళ్లు మీ పేరు మీద లేవని చెప్పగలరా? ఉన్నాయని నేను నిరూపిస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా’ అని సీఎం రేవంత్‌ ఛాలెంజ్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న ఈ ఆస్తులన్నీ ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ కుటుంబీకుల పేరిట ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇవేకాక కేసీఆర్ కుటుంబానికి అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయని రేవంత్‌ ఆరోపించారు. దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుక్కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల అభివృద్ధి చెందకపోగా అది కాస్తా ‘ఉరిసిల్ల’గా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గజ్వేల్‌ గడీని బద్దలు కొట్టి కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కు పంపామని, ఈసారి సిరిసిల్ల గడీని బద్దలు కోడుతాం అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఈ రోజు సిరిసిల్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావు, సంతోష్‌ రావులపై నిప్పులు చెరిగారు. అమెరికాలో బాత్రూంలు, హోటళ్లల్లో ప్లేట్లు కడిగిన కేటీఆర్‌కు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు.

దైవం, ధైర్యం కలిసి వెలిసిన పవిత్ర ప్రాంతం సిరిసిల్ల అన్న రేవంత్‌ రెడ్డి, ఇక్కడి చేనేత కార్మికులు తమ అద్భుతమైన వృత్తి నైపుణ్యంతో ‘అగ్గిపెట్టెలో పట్టే చీర’ను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని సీఎం కొనియాడారు. అంతటి ఘనత కలిగిన సిరిసిల్లను గత పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం సమస్యల వలయంగా మార్చారని మండిపడ్డారు. చేనేల కార్మికుల కన్నీళ్లు, ఆకలిచావులతో మగ్గాల చప్పుళ్లు నిలిచిపోయి, సంఘాల ఆందోళనలతో సిరిసిల్ల అంధకారంలోకి నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన కేకే మహేందర్ రెడ్డికి కేసీఆర్‌ మొండిచెయ్యి చూపి, అమెరికా నుంచి వచ్చిన తన కొడుకు కేటీఆర్‌ను ఇక్కడ బరిలోకి దింపారని రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ఆస్తులను వెనకేసుకుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తనపై కేటీఆర్‌ ఇష్ట రీతిన మాట్లాడుతున్నాడని, పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లుగా..నా గురించి కేటీఆర్ కు ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ గురించి అని, ఫాం హౌజ్‌ లో పడుకున్న కేసీఆర్‌ ను అడుగు అంటూ ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో సిరిసిల్ల గడ్డమీద గురిపెడదామని సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్. ఈసారి సిరిసిల్ల గడీని కూల్చేస్తామని హెచ్చరించారు. ఆనాడు గజ్వేల్ గడీని నేలమట్టం చేస్తామని చెప్పినం.. చేసి చూపించాం.. ఈ సారి సిరిసిల్ల గడీని కూల్చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

సిరిసిల్ల ప్రజలు వేసిన ఓట్లను పచ్చనోట్లుగా మార్చుకున్న కేటీఆర్ కోట్లు సంపాదించాడని ఆరోపించారు సీఎం రేవంత్. వలసపోయిన గల్ఫ్ కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం గల్ఫ్ వలసలను ఎందుకు నివారించలేకపోయిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఒక్కరోజు కూడా గల్ఫ్ బాధితుల గురించి కేసీఆర్ కుటుంబం పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా పాలమూరు జిల్లాలో కూడా ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఏ వ్యాపారం చేస్తే రూ. లక్ష కోట్లు వచ్చాయో ప్రజలకు చెప్పాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. ఆయన సడ్డకుడి కొడుకు సంతోష్ రావు మానేరు వాగులో ఇసుకను విచక్షణారహితంగా తోడి దోచుకున్నారని రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్‌‌తో కలిసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు, వారి అవినీతిని ప్రశ్నించిన దళితులను లారీలతో తొక్కి చంపించింది నిజం కాదా అని నిలదీశారు.

కేసీఆర్‌ ను సీం చేస్తే వేములవాడ శివయ్య, భద్రాద్రి రామయ్యకు శఠగోపం పెట్టాడన్నారు. నేత కార్మికుల కోసం పదేళ్లలో బీఆర్‌ఎస్‌ రూ.2,234 కోట్లు ఖర్చు చేస్తే… రెండున్నర సంవత్సరాల ప్రజాపాలనలో రూ.1731 కోట్లు ఇచ్చామని చెప్పుకున్నారు. రెండున్నరేళ్లలో ఈ జిల్లాకు రూ.1700 కోట్ల నిధులు ఇచ్చామని రేవంత్‌ తెలిపారు. ప్రజల సొమ్ముతో ఎర్రవల్లిలో కేసీఆర్‌, జన్వాడలో కేటీఆర్‌, శంకరపల్లిలో కవిత, వెంకటాపూర్‌లో హరీశ్‌రావు ఫాంహౌజ్‌లు కట్టుకున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.