
Graduate MLC Elections : త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు ఓసీ అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వాణీదేవినే ఖరారు చేస్తారా? లేదా మరోకరికి అవకాశం ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనుగుల రాకేష్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ రెండు స్థానాలకు ఓసీలను ప్రకటించడంతో బీఆర్ఎస్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాకేష్ రెడ్డి స్థానంలో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీ నాయకుడిగా పనిచేయడంతో పాటు గత ప్రభుత్వంలో తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన దూడిమెట్ల బాలరాజుకు టికెట్ ఇప్పించేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓసీ అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ సీరియస్ అయింది. ఈ విషయంలో బీసీలంటే లెక్కలేదా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి రాకేష్ రెడ్డికి కాకుండా దూదిమెట్ల బాలరాజుకు ఇస్తారని తెలుస్తోంది.
Also Read : అమెరికాలో తెలంగాణ యువతి మృతి!
మూడు జిల్లాలను చుట్టేసిన రాకేష్ రెడ్డి
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలనే లక్ష్యంగా పెట్టుకున్న అనుగుల రాకేష్ రెడ్డి ఇప్పటికే మూడు జిల్లాల్లో ప్రతీ మండలాన్ని చుట్టేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అనుగుల రాకేష్ రెడ్డి ఓడిపోయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఆయా జిల్లాల్లో పర్యటనలు కొనసాగించారు. ఇప్పటికే మూడు జిల్లాలను చుట్టేసిన రాకేష్ రెడ్డి..విద్యార్థుల సమస్యలు, ఉద్యోగాలపై క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తున్నారు. ప్రతీ ఆందోళన, పార్టీ కార్యక్రమలన్నింటికీ హాజరవుతూ ప్రజల దృష్టిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఓటరు నమోదుపై అవగాహన సదస్సుకు రాకేష్ రెడ్డి హాజరయ్యారు. టికెట్ పై రెండేళ్ల క్రితమే పార్టీ నుంచి భరోసా వచ్చిందని ఆయన అనచరులు చెబుతున్నారు. అయితే.. బీసీ సెంటిమెంట్ నేపథ్యంలో రాకేష్ రెడ్డికి నో ఛాన్స్ అని విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీలో దాదాపు పదేళ్లు పని చేసిన రాకేష్ రెడ్డి వరంగల్ పశ్చిమ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ పార్టీ మొండిచేయి చూపడంతో ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లోకి వచ్చిన కొన్ని రోజులకే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆఖరి రౌండ్ వరకు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన రాకేష్ రెడ్డి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అయితే ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read : స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్కార్ట్ స్టోర్లపై టీజీ సేఫ్ దాడులు… బయటపడ్డ సంచలన లోపాలు









