వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణమయ్యారు.

Also Read : హిందూ ఆలయంలో కలకలం.. అమ్మవారి విగ్రహంపై దాడి!

వికారాబాద్ జిల్లా ధరూరు మండలం చింతకుంట గ్రామంలో జరిగే ఒక అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వారంతా వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సు అనంతగిరి కొండ పైనుంచి కిందికి దిగుతుండగా ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద వేగం అదుపు తప్పింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన ఏడుగురిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌ స్టోర్లపై టీజీ సేఫ్‌ దాడులు… బయటపడ్డ సంచలన లోపాలు