
దేశవ్యాప్తంగా విజయదశమి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో భారీ ఎత్తున్న రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రజలు నమ్ముతారు.
ఇందులో భాగంగానే ఢిల్లీలో పెద్ద పెద్ద రావణ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీలోని ద్వారకా శ్రీ రామ్ లీల సొసైటీ ఎవరూ ఊహించని సరికొత్త ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ఏకంగా 221 అడుగులు ఉన్న భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను తయారుచేసింది. ఇదివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ పరిమాణంలో దీనిని రూపొందించడం విశేషం. దీంతో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన దిష్టిబొమ్మగా ఇది చరిత్రకెక్కింది. ఈ భారీ దిష్టిబొమ్మను చూసేందుకు స్థానికులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు.
రావణుడితో పాటు 30 అడుగుల బొద్దింక దహనం!
ఢిల్లీలోని పితంపురాలో ఉన్న నేతాజీ సుభాష్ ప్లేస్ మైదానంలో ఈసారి దసరా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ.. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనుంది. https://t.co/10u7wZGDN2
— Tupaki (@tupaki_official) October 20, 2026
ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీలోని పితంపురాలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేసే నిర్వహకులు ఈసారి పెద్ద ఎత్తు్న్న బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేసేందుకు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన 30 అడుగుల రాకాసి బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. సమాజంలో అపరిశుభ్రతకు, చెత్తాచెదారానికి ప్రతీకగా ఈ బొద్దింక దిష్టిబొమ్మను ఏర్పాటు చేసినట్లు రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ దేవరాహా తెలిపారు. అలాగే ఢిల్లీలోని లవ్ కుష్ లీల గ్రౌండ్‌లో కూడా 110 అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను రూపొందించారు.
#WATCH पंचकूला, हरियाणा: दशहरे के अवसर पर शहर में 221 फीट ऊंचा रावण का पुतला तैयार किया गया है। https://t.co/7gdafk6jEW
— ANI_HindiNews (@AHindinews) October 20, 2026









