టాటా గ్రూప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటా, కంపెనీ పెట్టుబడుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన వ్యాపార ప్రణాళిక, నష్టాల అంచనా లేకుండా టాటా సన్స్ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రూ.23,000 కోట్ల భారీ నిధులకు సంబంధించి ప్రతి పైసాకూ లెక్క చెప్పాల్సిందేనని ఆయన పట్టుబట్టడం వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

రూ.23,000 కోట్ల పెట్టుబడులపై అభ్యంతరంఈ ఏడాది జూన్‌లో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో రూ. 23,000 కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఈ నిధులను ఎయిర్ ఇండియాను ఆదుకోవడానికి, తేజస్ నెట్‌వర్క్స్, టాటా న్యూ యాప్, టాటా డిజిటల్ రంగాల్లో పెట్టాలని అనుకున్నారు. అయితే దీనిపై నోయెల్ టాటా తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేవలం బోర్డు ఆమోదం సరిపోదని, ఈ డబ్బు ఎక్కడెక్కడ ఖర్చవుతుంది. దీనివల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందా అనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు.

Also Read : లక్కు తంతే కారులో పడ్డాడు.. రూ.200తో రూ.50 లక్షల ఫార్చ్యూనర్‌

నోయెల్ టాటాకు ఉన్న ప్రత్యేక అధికారాలుఈ నిర్ణయాల వెనుక నోయెల్ టాటాకున్న అధికారాలే ప్రధాన కారణం. టాటా సన్స్ నిబంధనల ప్రకారం రూ.100 కోట్లకు మించి ఏ పెట్టుబడి పెట్టాలన్నా టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసిన డైరెక్టర్ల మెజారిటీ ఆమోదం తప్పనిసరి. ఆ కీలక డైరెక్టర్లలో నోయెల్ టాటా ఒకరు కాగా, మరొకరు వేణు శ్రీనివాసన్. అందువల్ల నోయెల్ టాటా అప్పు ఒప్పుకోకపోతే ఎలాంటి పెద్ద నిధుల బదిలీ జరగడం సాధ్యం కాదు. ఛైర్మన్ నియామకంపై విభేదాలుసెప్టెంబరులో జరిగిన బోర్డు సమావేశంలోనూ నోయెల్ టాటా తన పద్ధతిని మార్చుకోలేదు. ఏ పనైనా సరే సరైన బిజినెస్ ప్లాన్‌తోనే రావాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని పొడిగించే అంశం రాగా.. దానిని కూడా నోయెల్ టాటా ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది.

ఆర్‌బీఐ నిబంధనల తలనొప్పులుమరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ కూడా టాటా సన్స్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ కంపెనీగా గుర్తించిన ఆర్బీఐ, స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా తప్పనిసరిగా లిస్ట్ కావాలని ఆదేశించింది. దీని నుంచి మినహాయింపు కోరినా ఆర్బీఐ ఒప్పుకోలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీని రెండుగా విలీనం చేయాలని నోయెల్ టాటా ప్రతిపాదించినా, ఆర్బీఐ మాత్రం నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. మొత్తానికి నిధుల సమీక్ష, ఛైర్మన్ పదవి, ఆర్బీఐ రూల్స్‌తో టాటా గ్రూప్‌లో అంతర్గత వేడి కొనసాగుతోంది.

Also Read : జియో దెబ్బకు టాటా గ్రూప్ వెనక్కి.. రూ. 30.5 లక్షల కోట్లతో అంబానీ రికార్డు!